చిరంజీవిని చూసి మొరిగితే, చిరంజీవికి చేటా.?

 చిరంజీవిని చూసి మొరిగితే, చిరంజీవికి చేటా.?

Chiranjeevi

Chiranjeevi Supports Janasena Party.. మెగాస్టార్ చిరంజీవి, తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు అభ్యర్థులకు మద్దతుగా మాట్లాడారు.!

అంతే, అది గట్టని కొన్ని మూకలు, ఏకంగా ఆయన్ని చంపేస్తామనే స్థాయిలో రెచ్చిపోతున్నాయి.!

అసలు ప్రజాస్వామ్యమంటే ఏంటి.? రాజ్యాంగం మనకి ప్రసాదించిన హక్కులేంటి.? అన్న విషయాల్ని మర్చిపోతున్నాయి ఈ మూకలు.!

Chiranjeevi Supports Janasena Party.. కొండని చూసి కుక్కలు మొరిగితే..

మెగాస్టార్ చిరంజీవి మీద అక్రమాస్తుల కేసులేమీ లేదు. ఆయనేమీ జైల్లో చిప్పకూడు తినిందీ లేదు.!

అలా జైల్లో చిప్పకూడు తిన్నోళ్ళు, తమ అశుద్ధంతో కొన్ని మూకల్ని ‘అశుద్ధం’తో మేపుతోంటే, ఆ మూకలు సభ్య సమాజం మీద పడి అరాచకం సృష్టిస్తున్నాయి.

అసలంటూ వ్యవస్థలేం చేస్తున్నాయి.? ఆ వ్యవస్థల్లోని కొందరు అధికారులు, పైన చెప్పుకున్న మూకల్లానే, ఆ అశుద్ధానికి అలవాటు పడిపోతే, ఇక.. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం.. హక్కులు ఎలా వుంటాయ్.?

కొండని చూసి కుక్కలు మొరిగితే కొండకు చేటా.? అలాగే, చిరంజీవిని చూసి అశుద్ధ భక్షకులైన కుక్కుల మొరిగితే, చిరంజీవికి చేటా.?

ఇది రాజకీయం కాదు.!

అసలిప్పుడు నడుస్తున్నది రాజకీయమే కాదు.! ఎవరు ఎవరికైనా మద్దతిచ్చుకోని.. ఏమవుతుంది.? ఎవరిష్టం వారిది. ఎవరికి నచ్చినవారికి వారు ఓటేసుకుంటారు.

ఓట్లను కొనుక్కోవడం అలవాటైపోయినోళ్ళకి, నిజానికి ఎలాంటి భయాలూ వుండకూడదు. అంతలా బరితెగించేశారు. కానీ, తప్పు చేస్తున్నామన్న భయం.. వారితో, సమాజంపై ఇదిగో ఇలాంటి మూక దాడులు చేయిస్తున్నాయి.

మాజీ కేంద్ర మంత్రి.. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి రాజకీయంగా ఎవర్నీ విమర్శించలేదు. తనకు అత్యంత సన్నిహితులైన ఇద్దరు అభ్యర్థులకు అనుకూలంగా మాట్లాడారంతే.!

Also Read: ఓ ‘పొలిటికల్’ రాయీ.! నిన్నెవరు విసిరారోయీ.!

అందులో ఒకరు జనసేన అబ్యర్థి. ఇంకొకరు బీజేపీ అభ్యర్థి. జనసేన అంటే స్వయానా చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నడుస్తున్న పార్టీ.

ఆ జనసేన పార్టీకి మిత్రపక్షం బీజేపీ. అలాంటప్పుడు, చిరంజీవి తన తమ్ముడికి రాజకీయంగా మద్దతిస్తే అదెలా నేరమవుతుంది.?

అసలాయన ఏం మాట్లాడారో అశుద్ధ భక్షకులకు అనవసరం. అసలు ఆ మూకలకు మెదడంటూ లేదు. అదే అసలు సమస్య.!

Digiqole Ad

Related post