Harish BiggBossTelugu9 Mask Man.. బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, తొమ్మిదో సీజన్‌లో ‘బకరా’ ఎవరంటే, నిస్సందేహంగా, ‘హరిత హరీష్’ అని చెప్పొచ్చు.
హోస్ట్ అక్కినేని నాగార్జునతో పదే పదే తిట్టించుకోవడానికే హరిత హరీష్ అలియాస్ ‘మాస్క్ మ్యాన్’, బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళినట్లుంది పరిస్థితి.
హరీష్‌కి బిగ్ బాస్ ఇచ్చిన అనధికారిక టాస్క్ ఏంటంటే, హౌస్ మేట్స్ మీద నోరు పారేసుకోవడం. ‘రెడ్ ఫ్లవర్’.. అంటూ, ఇమ్మాన్యుయేల్ మీద ఆల్రెడీ నోరు జారాడు హరీష్.
Harish BiggBossTelugu9 Mask Man.. ఆడేసుకుంటున్నావ్ నాగ్.!
ప్రతి సీజన్‌లోనూ ఎవరో ఒకరితో వీకెండ్‌లో గట్టిగా ఆడేసుకోవడం హోస్ట్ అక్కినేని నాగార్జునకి అలవాటైన వ్యవహారమే. బిగ్ బాస్ అంటేనే అంత.!
కంటెస్టెంట్లు కూడా, సిగ్గూ ఎగ్గూ లేకుండా తిట్టించేసుకుంటుంటారు. అదో పైత్యం వాళ్ళది.! ఈయన తిట్టడం, ఆయన తిట్టించుకోవడం.. ఇదంతా పరమ రొటీన్ వ్యవహారం.
ఓ సందర్భంలో, హౌస్ మేట్స్ మీద, ‘లత్కోర్ పనులు’ అంటూ, నోరు జారాడు హరీష్. అంతే, అప్పుడే ఆ విషయమ్మీద హౌస్‌లో పెద్ద గొడవ అయిపోయింది.
వీకెండ్ ఎపిసోడ్‌లో.. చెలరేగిపోయిన హోస్ట్ నాగార్జున..
అన్నపూర్ణలా వంట చేశావ్.. అంటే, ఆ వ్యక్తిని అన్నపూర్ణతో పోల్చినట్లే. అలాగే, లత్కోర్ పని.. అంటే, ఆ వ్యక్తిని లత్కోర్.. అన్నట్లేనని అక్కినేని నాగార్జున తీర్మానించేశాడు.
ఇకపై, ‘లోఫర్ హరీష్’ అంటానంటూ, అక్కినేని నాగార్జున వ్యాఖ్యానించడమే కాదు, హౌస్ మేట్స్ అంతా అలాగే పిలవాలని కూడా ఆదేశించాడు.
బిగ్ బాస్ అంటే, అది జస్ట్ ఓ రియాల్టీ షో.! నిజానికి, అందులో రియాల్టీ ఏమీ వుండదు. ఓ వ్యక్తి క్యారెక్టర్‌ని హోస్ట్ నాగార్జున అలా ఎలా దెబ్బతీస్తాడు.? అన్న చర్చ జరగడం సహజమే.
Also Read: అనుష్క శెట్టికి మళ్ళీ ఏమయ్యింది.?
హరీష్ మీద సింపతీ రావడానికే నాగార్జున ఇదంతా చేస్తున్నాడా.? లేకపోతే, హౌస్‌లో అతన్ని ఎందుకు కొనసాగిస్తున్నట్లు.?
హరిత హరీష్ తీరుని ఆడియన్స్ ఎవరూ సపోర్ట్ చేయడంలేదు. అయినా, అతను హౌస్‌లో కొనసాగుతూనే వున్నాడు. ఇదో మ్యాజిక్.!
వీకెండ్‌లో అక్కినేని నాగార్జున నోటి దురద తీర్చుకోవడానికి, హరీష్ అనే బకరా.. ఈ సీజన్‌లో వున్నాడన్నమాట.
