Pawan Kalyan OG Collections.. వంద కోట్ల షేర్ కూడా లేదంటూ విమర్శలు.. ఓవర్సీస్‌లో మార్కెట్ పడిపోయిందంటూ వెటకారాలు.!
ఇవన్నీ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’కి ముందు వినిపించాయ్.! అప్పుడెవరైతే పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ మీద దుష్ప్రచారం చేశారో, వాళ్ళే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని పొగిడేస్తున్నారు.
సినిమా అంటేనే మ్యాజిక్. బాక్సాఫీస్ పవర్.. పవన్ కళ్యాణ్‌కి కొత్తేమీ కాదు. పవన్ కళ్యాణ్ సినిమాలు జయాపజయాలకు అతీతంగా వసూళ్ళను సాధిస్తాయ్.
నిఖార్సయిన ట్రేడ్ పండితులకి, పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ఏంటో తెలుసు. పవన్ కళ్యాణ్ సినిమాలకి డబ్బులు రాకపోతే, ఏ నిర్మాత అయినా, ఆయనతో ఎందుకు సినిమాలు నిర్మిస్తాడు.?
Pawan Kalyan OG Collections.. ఓజీ.. పవన్ కళ్యాణ్ పవర్ ఇంకోస్సారి.!
ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ఓ సంచలనం అయితే, తొలి రోజు మరో సంచలనం. రెండో రోజూ.. మూడో రోజూ.. ఇలా ప్రతి రోజూ సంచలనమే.
వెరసి, ఐదు మిలియన్ల డాలర్లు ఆల్రెడీ కొల్లగొట్టేసింది అమెరికాలో ఓజీ. ఇతర దేశాల్లో కూడా ‘ఓజీ’ అంచనాలకు మించిన విజయాన్ని అందుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో అయితే, ఓజీ మేనియా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుందేమో. పెరిగిన టిక్కెట్ ధరల్నీ లెక్క చేయట్లేదు సినీ అభిమానులు.
పవన్ కళ్యాణ్‌ని వెండితెరపై దర్శకుడు సుజీత్ చూపించిన తీరు, పవన్ కళ్యాణ్ కోసం తమన్ అందించిన బీజీఎం.. వాట్ నాట్.. అన్నీ, సినిమాని మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తున్నాయి.
Pawan Kalyan OG Collections.. టిక్కెట్ల ధరలు తగ్గితే..
‘ఎ’ సర్టిఫికెట్‌తోనే ‘ఓజీ’ ఇన్ని సంచలనాలు సృష్టిస్తోందంటే, ‘యు/ఎ) సర్టిఫికెట్ వచ్చి వుంటే, ఇంకెలాంటి ప్రభంజనాన్ని మనం చూసేవాళ్ళమో.
ఇంకోపక్క, టిక్కెట్ ధరల్ని తగ్గించడం (మామూలు ధరలకు తీసుకురావడం) చేస్తే, ‘ఓజీ’కి అది అదనపు అడ్వాంటేజ్ అవుతుందన్న అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది.
Also Read: దళిత వాడల్లో హిందూ దేవాలయాలపై షర్మిలకు భయమెందుకు.?
తొలి రోజే వంద కోట్ల షేర్ కొల్లగొట్టిన ‘ఓజీ’, ఆల్రెడీ లాభాల్లో నడుస్తోందిప్పుడు. వచ్చే ప్రతి రూపాయీ, నిర్మాతకి లాభమే. దటీజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
ఓ వర్గం, ‘ఓజీ’ సినిమాని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదే వర్గం, ‘ఓజీ’ పైరసీ వీడియోను ప్రచారంలోకి తీసుకొచ్చింది. సోషల్ మీడియా వేదికగా అదే వర్గం ‘ఓజీ’పై నిత్యం విషం చిమ్ముతూనే వుంది.
అయినా డోన్ట్ కేర్.! పవన్ కళ్యాణ్ ప్రభంజనం ముందర, ఈ వెకిలి వేషాలేవీ వర్కవుట్ అవడంలేదు.! ‘ఓజీ’ క్లీన్ హిట్.. సూపర్ డూపర్ హిట్ అంతే.!
