Malavika Mohnan: ‘ఆ నాలుగ్గంటల కష్టం’ తెలుసా మీకు.?
Malavika Mohanan Thangalaan
Malavika Mohanan Thangalaan.. మాళవిక మోహనన్ గుర్తుంది కదా.? తెలుగులో ‘రాజా సాబ్’ సినిమాలో నటిస్తోందీ బ్యూటీ. చాన్నాళ్ళ క్రితం విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేయాల్సి వుంది.
అప్పట్లో ఆ సినిమా ప్రారంభమైంది, కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. అనివార్య కారణాలవల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది.
ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ‘తంగలాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మాళవిక మోహనన్ (Malavika Mohanan).
ఈ నేపథ్యంలో తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా, పలు ప్రశ్నలకు సమాధానమిచ్చింది ఈ బ్యూటీ.
Malavika Mohanan Thangalaan.. ఫొటో చెప్పిన కథ..
ఓ అభిమాని, షూటింగ్ స్పాట్‌కి సంబంధించి ఓ ఫొటోని షేర్ చేయమని అడిగితే, ఇక్కడ మీరు చూస్తున్న ఫొటోని మాళవిక పోస్ట్ చేసింది.
షూటింగ్ స్పాట్‌కి వెళ్ళాక, మొత్తం మేకప్ కోసమే నాలుగు గంటల సమయం పట్టేదట.! ఆపై ఎప్పటికప్పుడు టచప్స్ తప్పనిసరి అయ్యేవట.

తన కెరీర్‌లోనే ‘తంగలాన్’ వెరీ వెరీ స్పెషల్ మూవీ అంటోన్న మాళవిక మోహనన్, నటిగా ఈ సినిమా తనకు ప్రత్యేకమైన గుర్తింపునిస్తుందని చెప్పుకొచ్చింది.
Also Read: అనసూయ ఆ విషయంలో అస్సలు తగ్గేదే లే.!
డాన్స్ చేయడానికి ఇష్టపడతావా.? ఫైట్స్ చేయడానికి ఇష్టపడతావా.? అనడిగితే, ఎప్పుడైనాసరే, ‘ఫైట్స్ చేయడానికే ఇష్టపడతా’ అని మాళవిక మోహనన్ సమాధానమిచ్చింది.