Table of Contents
Gold India World Leader.. పెళ్ళంటే బంగారం.! పుట్టినరోజు అయినా బంగారమే.! ఆ మాటకొస్తే, పుట్టుకకి మాత్రమే కాదు, చావుకీ బంగారమే.!
ఔను, బంగారంతో ముడిపడిపోయాయ్ మన జీవితాలు.! మన భారతీయులకి బంగారం అంటే ఎంత మక్కువ.? అనడానికి, ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?
బంగారం ధరలేమో, ఆకాశాన్నంటుతున్నాయ్. అలాగని, బంగారం వాడకం తగ్గిందా.? అంటే, అదీ లేదు.! ఒకప్పుడు తులాల్లో కొంటే, ఇప్పుడు గ్రాముల్లో కొంటున్నారేమో. అంతే తేడా.!
Gold India World Leader.. 25 వేల టన్నుల బంగారం..
గ్రాము బంగారం పది వేల రూపాయల పై మాటే ఇప్పుడు.! అలాంటిది, తులాల్లో బంగారం కొనాలంటే, మాటలా.? అదే, కిలోల్లో బంగారం కొనాల్సి వస్తే.?
టన్నుల్లో బంగారం.. అనే మాట వింటేనే, గుండె దడ వచ్చేస్తుంటుంది. కానీ, ఇది అక్షరాలా నిజం. ఏకంగా, 25 వేల టన్నుల బంగారం గురించిన మాట ఇది.
ఇంత పెద్ద మొత్తంలో బంగారం ఎక్కడుంది.? ఎవరి దగ్గర వుంది.? ఇంకెక్కడ.? భారతీయ మహిళల వద్దనే ఆ బంగారం వుందట. అలాగని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెబుతోంది.
ఆ లెక్కల మాటేమిటి.?
ఎవరి దగ్గర ఎంత బంగారం వుంది.? అన్నదానిపై ఖచ్చితమైన లెక్కలేమీ వుండవు. ఎందుకంటే, చాలామందికి వంశపారంపర్యంగా బంగారం అనేది లభిస్తుంటుంది.
అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి అయిన బంగారం, ఇక్కడ, మన దేశంలో దుకాణాల్లో విక్రయించే బంగారానికి మాత్రమే లెక్కలుంటాయి.
పైన, చెప్పుకున్నట్లు వంశ పారంపర్యంగా లభించిన బంగారానికి లెక్కలు వుండవు కదా.! అదే సమయంలో, చరిత్రలో కాలగర్భంలో కలిసిపోయిన బంగారం సంగతేంటి.?
అది మళ్ళీ వేరే లెక్క. ఎప్పటికప్పుడు నేల మాళిగలు బయటపడుతూనే వున్నాయి మన దేశంలో ఎక్కడో ఓ చోట.. అందులో బంగారం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
ప్రపంచంలో.. బంగారం.. మనదే ఆధిపత్యం..
ఆభరణాల లెక్కల్లో తీసుకుంటే, ప్రపంచంలో మన వాటా 11 శాతం.! అంటే, చిన్న విషయమేమీ కాదు. బంగారు ఆభరణాల విషయంలో మనమే ‘తోపులం’ అన్నమాట.!
Also Read: వృక్ష రాజం.. కళాకృతిగా మారిన వైనం.! ఇదో అద్భుతం.!
మహిళలే కాదు, మగవాళ్ళకీ బంగారం మీద మోజు పెరుగుతోంది. నిజానికి, ఎప్పటినుంచో వున్నదే ఇది.! తులాల లెక్కన కాదు, కేజీల లెక్కన బంగారం శరీరం మీద ధరించి కొందరు కనిపిస్తుంటారు.
బంగారం అంటే, ఇప్పుడు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అది కూడా ఓ పెట్టుబడి.! ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే వుంటాయ్ తప్ప, తగ్గదు. అదీ బంగారం స్పెషల్.
