Star Kid Janhvi Kapoor.. స్టార్ కిడ్.. నెపో కిడ్.. ఇలా అంటుంటాం, సినీ రంగంలో ‘వారసుల’ గురించి.! వారసత్వమంటే, అదో బ్యాగేజీ అంటారు చాలామంది.!
నిజమే.! ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేని వారి మీద అసలు అంచనాలే వుండవు గనుక, తొలి సినిమా విషయంలో వాళ్ళకి పెద్దగా ఒత్తిడి వుండదు.
కానీ, స్టార్ కిడ్స్ విషయంలో అలా కాదు. తొలి సినిమా నుంచే, అంచనాలతోపాటు.. పోలికలూ ‘వారసుల్ని’ ఇబ్బంది పెడుతుంటాయి.!
Star Kid Janhvi Kapoor.. అతిలోక సుందరి కుమార్తెగా..
శ్రీదేవి అంటే, అతిలోక సుందరి. అలాంటి శ్రీదేవి కుమార్తె తెరంగేట్రమంటే ఆషామాషీ వ్యవహారమా.? మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నల్ని ఎదుర్కోవడమే తొలి సవాల్.

జాన్వీ కపూర్, అన్నిటినీ తట్టుకుంది. చాలా విమర్శల్ని ఎదుర్కొంది. నిలదొక్కుకుంది. అయితే, తానెదుర్కొన్న కష్టాల గురించి ఎక్కడా చెప్పుకోవడానికీ కూడా వుండదన్నది జాన్వీ ఆవేదన.
‘మా కష్టాల గురించి మేం మాట్లాడకూడదు. మాట్లాడితే, మళ్ళీ విమర్శలొస్తాయ్.. స్టార్ కిడ్స్‌కి ఈ విషయంలో ఫ్రీడమ్ లేదు..’ అని జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం..
ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా, సినిమాల్లోకి రావడం అంత తేలిక కాదని చెప్పిన జాన్వీ కపూర్, న్యూ టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో తానూ ముందుంటానని వివరించింది.
Also Read: పవన్ కళ్యాణ్ ఒక్కడు చెప్తే సరిపోతుందా?
‘వాళ్ళకి కొన్ని డిజడ్వాంటేజెస్ వున్నాయ్.. అలానే, మాక్కూడా..’ అంటున్న జాన్వీ కపూర్, ‘ఎవరి కష్టం వాళ్ళది.. ఒకర్ని తక్కువగా చూడటం, ఇంకొకర్ని ఎక్కువగా చూడటం’ తదని అభిప్రాయపడింది.
‘స్టార్ కిడ్’ అనే గుర్తింపు తొలి సినిమాకే ఉపయోగపడుతుందనీ, నిజానికి అది చాలా పెద్ద బ్యాగేజీ అనీ, జీవిత కాలం మోయాల్సిన బ్యాగేజీ అంటూ జాన్వీ కపూర్ వ్యాఖ్యానించింది.

తెలుగులో ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాలో రామ్ చరణ్ సరసన హీరోయిన్గా నటిస్తోంది జాన్వీ కపూర్. జూనియర్ ఎన్టీయార్ సరసన ‘దేవర’ సినిమాతో తెలుగులో తెరంగేట్రం చేసింది జాన్వీ.
బాలీవుడ్లో జాన్వీ కపూర్‌కి ‘ధడక్’ తొలి సినిమా.!
