Harish Shankar With Earnalist.. దర్శకుడు హరీష్ శంకర్, ఓ సినీ ఎర్నలిస్టుతో సోషల్ మీడియా వేదికగా పంచాయితీ పెట్టుకున్నాడు.! పాత కథే, కాకపోతే కొత్తగా మొదలైందంతే.!
‘మిస్టర్ బచ్చన్’ సినిమా రిలీజ్ నేపథ్యంలో సదరు సినీ ఎర్నలిస్టు షరామామూలుగానే, దర్శకుడు హరీష్ శంకర్‌ని కెలికాడు.
Murthy gaaru meeku Interview iddamanukuntunna daya chesi chedagottukokandi….. prastuthaaniki idhi request maatrame !!!
Harish Shankar
కెలకడం, కెలికించుకోవడం.. ఇది ఈ మధ్యకాలంలో సదరు సినీ ఎర్నలిస్టుకీ, సినీ పరిశ్రమలో కొందరికీ సర్వసాధారణమైపోయింది.
పనిగట్టుకుని సినిమాని చంపేద్దామనుకుంటాడా సినీ జర్నలిస్ట్. సర్లే, వివాదాలు సినిమాకి కలిసొస్తాయ్.. అనుకుంటారు కొందరు సినీ ప్రముఖులు.
Harish Shankar With Earnalist.. పద్ధతి ప్రకారం నడుస్తోన్న సినీ నాటకం..
వెరసి, ఈ ‘నాటకం’ చాన్నాళ్ళుగా ఓ పద్ధతి ప్రకారం నడుస్తూ వెళుతోంది. ఆ సినీ ఎర్నలిస్టుని బ్యాన్ చేయాలంటారు కొందరు. కానీ, ‘దున్నపోతులా’ మేపుతుంటారు వాళ్ళే ఆ ఎర్నలిస్టుని.
నువ్వు కొట్టినట్లు నటించు.. నేను ఏడ్చినట్లు నటిస్తాను.. అన్నట్లుంటుంది వ్యవహారం.! సినీ పరిశ్రమ తలచుకుంటే, తమను పట్టి పీడిస్తున్న ఆ ‘ఎర్నలిస్టు వైరస్’ని ఎప్పుడో వదిలించుకునేదే.!
“మీరు ఒక సారి ఇంటర్వ్యు ఇస్తా అని ఇవ్వలేదంట “అన్నప్పుడు సరే … ఈసారి ఆయనతోనే మొదలెడదాం….అన్నాను !!! ఇది నా వైపు నుండి క్లారిటీ !!! ఇక పోతే …. గతం లో “భవదీయుడు భగత్ సింగ్ “ టైటిల్ లీక్ చేసిన మీరు తప్పు ,ఒప్పు అంటూ డిస్కషన్ పెట్టకండి … మీకు suit అవ్వదు
@sairaaj44 కేవలం మీ సోషల్ మీడియా పరపతి పెంచుకోడానికి details leak చేసి దాని తాలూకా official update from production house fun kill చేసే మీలాంటి వాళ్లు తప్పొప్పులు మాట్లాడటం చూస్తే..
నేను DIrector కాబట్టి ఇంకా మర్యాదగా మాట్లాడుతున్న …
Harish Shankar
లీకులిచ్చేదీ సినీ జనాలే, ఆ లీకుల మీద పడి ఏడ్చేదీ సినీ జనాలే.. అన్నట్లు తయారైంది పరిస్థితి. గాసిప్పులు వేరు.. గాలి పోగెయ్యడం వేరు.! లీకులు వేరు, ఈ దిక్కుమాలిన ఎర్నలిస్టు చేసే భంచిక్ వ్యవహారాలు వేరు.
సదరు ఎర్నలిస్టేమో హరీష్ శంకర్‌ని ఇంటర్వ్యూ అడిగాడట.. కానీ, తాను ఇంటర్వ్యూ అడగలేదంటాడా ఎర్నలిస్టు. కామెడీగా లేదూ.!
Also Read: అల్లు అర్జున్‌ని ఎందుకు ట్రోల్ చెయ్యకూడదు ఆదీ.?
డిస్ట్రిబ్యూటర్ చెప్పాడు.. నిర్మాత నుంచి సమాచారం వచ్చింది.. ఇవీ ఎర్నలిస్టు వాదనలు. నాన్సెన్స్.. అంటారు దర్శక నిర్మాతలు, నటీనటులు. ‘మిస్టర్ బచ్చన్’ మాత్రమే కాదు, చాలా సినిమాల విషయంలో ఇలా జరిగింది.
సినిమా అంటేనే మాయ..
సినిమా అంటేనే ఓ మాయ.! వున్నది లేనట్టు, లేనిది వున్నట్టు.. చూపించే ఓ అందమైన అబద్దం.! అదో కళ.! వసూళ్ళ లెక్కలు, బిజినెస్ వ్యవహారాలు కూడా అంతే.
అన్నీ, అందరికీ తెలుసు.! కానీ, ఇదో మహా నాటకం.! గతంలో విజయ్ దేవరకొండ, ఇప్పుడేమో హరీష్ శంకర్.. చెప్పుకుంటూ పోతే లిస్టు పెద్దదే.
మీరు తప్పు చేశారు అని నేను అనుకొని ఉంటే రిక్వెస్ట్ అనే వాడిని కాదు !! transaction ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఇద్దరితో confirm చేసుకోవాలి ….. btw meeru interview adigaarani naaku oka person cheppadu…. Meeku “oka” Distributor cheppinattu
Harish Shankar
సదరు ఎర్నలిస్టు వల్ల బాధితులుగా మారినవారు.. ఆ ఎర్నలిస్టుని వాడుకున్నవాళ్ళు.. బోల్డంతమంది వున్నారు సినీ పరిశ్రమలో.
ఇంతకీ, ‘మిస్టర్ బచ్చన్’ రచ్చ వెనుక అసలు కోణమేంటి.? ఇది కూడా పబ్లిసిటీ స్టంటేనా హరీష్ శంకర్.?