Krithi Shetty Genie.. కృతి శెట్టి చాలా మంచి డాన్సర్. సంప్రదాయ నృత్యాన్ని నేర్చుకుందామె. మోడ్రన్ డాన్సులు కూడా నేర్చుకుంది.
‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి, తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ సినిమాలు చేసిన, చేస్తున్న సంగతి తెలిసిందే.
తమిళంలో ‘జీనీ’ పేరుతో తెరకెక్కిన సినిమాలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా, ‘జీనీ’ సినిమా నుంచి ‘అబ్దీ అబ్దీ’ అంటూ సాగే పాట ఒకటి విడుదల చేశారు.
Krithi Shetty Genie.. అరబిక్ డాన్స్.. అదరహో..
స్టార్టింగ్ టు ఎండింగ్.. కృతి శెట్టి హై ఓల్టేజ్ ఎనర్జీతో డాన్స్ చేసింది ‘జీనీ’ సినిమాలోని ‘అబ్డీ అబ్డీ’ పాట కోసం.!
కృతి శెట్టి ఇంత బాగా డాన్స్ చేస్తుందా.? అని అంతా ఆశ్చర్యపోయారంటే, అది అతిశయోక్తి కాదేమో.! కాస్తంత హాట్ అప్పీల్ కూడా పండించింది కృతి శెట్టి.
తప్పదు.. పాట, అందులోని డాన్స్ మూమెంట్స్ అలాంటివి. ఆ ఎక్స్‌ప్రెషన్స్ వేరే లెవల్.. డాన్స్ చేస్తున్నప్పుడు.!
ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కృతి శెట్టి డాన్స్ మూమెంట్స్ గురించి, ఇప్పుడంతటా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఇంతకాలం, కృతి శెట్టిలోని డాన్సర్‌ని సరిగ్గా వాడుకోలేకపోయారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఆమె అభిమానుల నుంచి.
ఇదిలా వుంటే, కృతి శెట్టి సరైన హిట్టు కోసం ఎదురుచూస్తోందిప్పుడు. ఆ హిట్, ‘జీనీ’ సినిమాతో కృతి శెట్టికి వస్తుందా.?
Also Read: హృదయ పూర్వం సమీక్ష: కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం.!
అన్నట్టు, ‘జీనీ’లో ‘అబ్దీ అబ్దీ’ పాట కోసం కృతి శెట్టితోపాటు స్క్రీన్ షేర్ చేసుకుంది మరో బ్యూటీ కళ్యాణి ప్రియ దర్శన్.
ఇటు కృతి శెట్టి, అటు కళ్యాణి ప్రియదర్శన్.. మాంఛి కెమిస్ట్రీతో అరబిక్ డాన్స్ మూమెంట్స్‌ని ఇరగదీసేశారు.!
