డైరెక్టర్‌ని ‘వుంచుకుంటా’నన్న హీరోయిన్.! ఇదో రకం పైత్యం.!

Malvika Nair

Malvika Nair Tollywood చక్కనమ్మ ఏం మాట్లాడినా అందమే అనుకుంటే పొరపాటే సుమా.! ‘క్యూట్’ అనే సాకుతో ముద్దుగుమ్మలు నోటికొచ్చినట్లు మాట్లాడేస్తే కుదురుతుందా.?

కుదరనే కుదరదు. ఆ క్యూట్ మాటల వెనక బూతు వినిపిస్తుంది. అదెంతో జుగుప్స కలిగిస్తుంది. అసలు ఈ బూతేంటీ.? క్యూటేంటీ.? అనుకుంటున్నారా.? అసలు విషయానికొచ్చేద్దాం.

‘ఎవడే సుబ్రహ్మణ్యం’, ‘కళ్యాణ వైభోగం’ తదితర సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ గుర్తుండే వుంటుంది. పేరు మాళవికా నాయర్.

Malvika Nair Tollywood మాళవికకు ఏమైంది.?

ఈ అందాల భామ ఓ సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా ఏంటీ.? కథా కమామిషు సంగతేంటీ.? అనేది పక్కన పెడితే, సదరు సినిమా ప్రమోషన్ల నిమిత్తం డైరెక్టర్ అనుదీప్‌తో ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది మాళవిక.

అనుదీప్ అంటే ఎవరని అడక్కండి. ‘జాతి రత్నాలు’ డైరెక్టర్ ఆయన. అందరికీ సుపరిచితుడే. సరే, అసలు మ్యాటర్‌లోకి వెళ్లిపోదాం మళ్లీ.

ఈ డైరెక్టర్ అనుదీప్‌ని వుంచుకుంటా.. అని మాళవికా నాయర్ క్యూటు పలుకులు పలికేసిందండోయ్. ఇంటర్వ్యూలో భాగంగా, ‘మీరు ఏమీ అనుకోనంటే మీతో ఓ మాట చెబుతాను..’ అని చెప్పి ఈ మాట అనేసింది.

అసలీ ‘వుంచుకోవడం’ గోలేంట్రా బాబూ.!

వుంచుకోవడం అనే మాటకు మాళవికకు (Malavika Nair) అర్ధం తెలీదా.? తెలుగులో ఈ మాటను బూతు పదంగానే అభివర్ణిస్తుంటాం.

ఒకవేళ ఆ విషయం మాళవికా నాయర్‌కి (Malvika Nair) తెలీదా.? తెలియక కాదండోయ్. చెప్పట్లా.! ఈ రోజుల్లో ప్రతిదీ ఫ్యాషన్ అయిపోయింది.

Malvika Nair
Malvika Nair

అందులోనూ బూతు అనేది మరీ ట్రెండ్ అయిపోయింది. అందగత్తెలయితే, ఇదిగో ఇలా ‘క్యూటు’ పేరు చెప్పి బూతు పురాణాలు ఈజీగా రచించేస్తున్నారు.

ఆ తర్వాత ఇక వుండనే వుందిగా.. ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చేందుకు సోషల్ మీడియా. అక్కడ ట్రెండింగ్ అయిపోతున్నారు. అలా ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్న చందంగా తయారైంది బూతు వెర్సస్ క్యూటు పరిస్థితి.

అయ్యయ్యో.! పెడార్ధాలు తీయొద్దు..

మిడిల్ ఫింగర్ చూపించం ఫ్యాషన్ అయిపోయింది. వల్గారిటీని చాలా చాలా సాధారణ విషయంగా మార్చేశారు. అలాగే ఈ ‘వుంచుకోవడం’ కూడా.

Also Read: కాజల్ అగర్వాల్ కూడా మొదలెట్టేసిందిగా.!

అబ్బబ్బే.! వుంచుకోవడం అన్న మాటలో పెడార్ధం ఏముంది.? అది చాలా మామూలు మాటే.. అని బుకాయించినా బుకాయించేస్తారు.

ఛి..ఛీ..! పబ్లిసిటీ కోసం ఏ స్థాయికైనా దిగజారి పోతారా.? ఇదేం పద్ధతి.? సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఈ తరహా పైత్యాలు సమాజంపై ఎంతటి తీవ్ర ప్రభావం చూపిస్తాయో అర్ధం చేసుకోకపోతే ఎలా.?

hellomudra

Related post