Kiran Abbavaram Mythri Dude.. మంచి కంటెంట్‌తో వెళితే, ఎవరూ ఆపరు.! థియేటర్లు దొరక్కపోవడం అనే మాట సబబు కాదు.! ఇదీ, మైత్రీ మూవీ మేకర్స్ తరఫున వచ్చిన స్పష్టత.
అంతకు ముందు, తమిళనాడులో తన సినిమా ‘క’కి థియేటర్లు దొరకలేదని, హీరో కిరణ్ అబ్బవరం వ్యాఖ్యానించాడు.
తమిళనాడులో మన సినిమాలకి థియేటర్లు దొరకవు, అదే తమిళ సినిమాలకైతే మన థియేటర్లు విచ్చలవిడిగా ఇచ్చేస్తాం.. అన్నది కిరణ్ అబ్బవరం ఆవేదన.
Kiran Abbavaram Mythri Dude.. దీపావళి.. వాళ్ళ పండగ.!
దీపావళి తమిళనాట పెద్ద పండగ.. అక్కడ వచ్చే సినిమాలకి ఓ రేంజ్ వుంటుంది.. అంటూ మైత్రీ రవి చేసిన వ్యాఖ్యల్ని పూర్తిగా కొట్టి పారేయలేం. అలాగని పూర్తిగా సమర్థించలేం.!
మనకి కూడా దీపావళి పెద్ద పండగే.! ఇక్కడా తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. వాటకంటే ఎక్కువగా, తమిళ సినిమాకి థియేటర్లు కేటాయించడం ఎంతవరకు సబబు.?
పోనీ, ఇక్కడ తమిళ సినిమాలకు థియేటర్లు దొరుకుతున్నట్లు, తమిళనాడులో మన తెలుగు సినిమాలకీ థియేటర్లు దొరకాలి కదా.?
సంక్రాంతికీ.. అదే రచ్చ..
కొన్నాళ్ళ క్రితం ఓ తమిళ సినిమాని, తెలుగులోకి తీసుకొచ్చారు నిర్మాత దిల్ రాజు. అదీ సంక్రాంతికి. అప్పట్లో పెద్ద గోల గోల అయ్యింది.
మన సినిమాలకి, తమిళనాడులో థియేటర్లు ఇవ్వరు కదా, తెలుగు సినిమాల్ని కాదని తమిళ సినిమాలకి సంక్రాంతి పండుగ సందర్భంగా అవకాశమివ్వడమేంటి.? అన్న వాదన అప్పట్లో తెరపైకొచ్చింది.
Also Read: పిచ్చోడితో ఐపీఎస్ ‘సూసైడ్ ఆపరేషన్’.!
అంతిమంగా.. సినిమా అంటే, అదొక వ్యాపారం.! ఇక్కడ బిజినెస్ లెక్కలే, అన్నిటినీ డిసైడ్ చేస్తాయి. పైగా, పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువ కదా.!
ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే.. కిరణ్ అబ్బవరం వాదన తప్పు.. అనడం ద్వారా, తెలుగు సినిమా కంటే అరవ సినిమా ముద్దు.. అనే సంకేతాన్ని మైత్రీ రవి శంకర్ ఇచ్చినట్లయ్యింది.
అన్నట్టు, మైత్రీ సంస్థ ‘డ్యూడ్’ అనే తమిళ సినిమాని తెలుగులోకి తీసుకొస్తోంది. ఈ సినిమాకి తెలుగులోనూ ప్రమోషన్లు చాలా గట్టిగా చేస్తున్నారు.
