Table of Contents
LIp Stick Pros Cons.. ప్రపంచ వ్యాప్తంగా ఆడ లేడీస్ అంతా ఇష్టపడి వాడే సౌందర్య సాధనాల్లో లిప్‌స్టిక్ ఒకటి.
అఫ్కోర్స్.! సినీ, తదితర రంగాల్లో అయితే మగవారి మేకప్‌లోనూ లిప్ స్టిక్ భాగమే అనుకోండి.!
అయితే, లేడీస్లోనే ఎక్కువ మంది లిప్ స్టిక్‌ని ఇష్టపడుతుంటారు. లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల అందం, ఆకర్షణే కాదండోయ్ ఆత్మ విశ్వాసం కూడా పెరుగుతుందని నమ్ముతుంటారు కొందరు మహిళలు.
అందుకే లిప్ స్టిక్‌ని వాడుతుంటారు. నాణానికి రెండు కోణాలు అన్నట్లుగా అందాన్ని పెంచే ఈ లిప్స్టిక్లోనూ మంచి, చెడు అనే రెండు యాంగిల్స్ వున్నాయండోయ్.
LIp Stick Pros Cons.. మంచి గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే..
కొన్ని లిప్ స్టిక్స్ లేదా లిప్ బామ్స్ వంటివి పెదాలను రక్షిస్తాయ్. ఎలా అంటారా.? ఎండ నుంచి, చలి నుంచి పెదాలను రక్షించి, తద్వారా పెదాలు పొడిబారిపోనీయకుండా చేస్తాయ్.
లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల కొందరిలో మానసిక ఉత్సాహం, ఉల్లాసం వస్తుందని చెబుతున్నారు. అలాగే, అందం, ఆకర్షణ కూడా.
లిప్ స్టిక్ వాడడం వల్ల నష్టాలేంటీ.?
ముందే చెప్పుకున్నాం కదా.. లాభాలతో పాటూ నష్టాలూ అధికమే. అతిగా లిప్ స్టిక్ వాడడం వల్ల సహజ సిద్ధంగా పెదాల్లో వుండే తేమ పోయి నిర్జీవంగా మారిపోతాయ్.
పెదాలు తమ సహజమైన రంగులు కోల్పోతాయ్. నల్లగా మారిపోతాయ్. కొన్ని లిప్ స్టిక్స్‌లో లెడ్, అల్యూమినియం వంటి రసాయనాలు మిక్స్ చేస్తారు.

ఈ రసాయనాల కారణంగా పెదాల్లో దురద, వాపు, ఇతరత్రా అలెర్జీలు వచ్చే ప్రమాదముంది.
కొన్ని రకాల లిప్‌స్టిక్స్‌లో హానికరమైన రసాయనాలు వాడుతుంటారు. అవి నోటి ద్వారా కడుపులోకి చేరడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపించే ప్రమాదం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.?
అన్ని లిప్స్టిక్స్ హానికరం అని చెప్పలేం. అందుకే లిప్‌స్టిక్ కొనేటప్పుడే మంచి బ్రాండ్ వున్నలిప్స్టిక్స్ ఎంచుకోవడం మంచిది. హెర్బల్ లిప్ స్టిక్స్‌ని అయితే ఇంకా మంచిది.
అలాగే, రాత్రి పడుకునే ముందు పెదాల నుంచి లిప్ స్టిక్‌ని పూర్తిగా తొలగించి నిద్ర పోవాలి.
లిప్ స్టిక్ వాడే ముందు లిప్ బామ్ ఖచ్చితంగా వాడాల్సి వుంటుంది. ప్రతిరోజూ కాకుండా అవసరాన్ని బట్టి లిప్‌స్టిక్ వాడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Also Read: అదొక్కటే తక్కువైందిక్కడ.!
లిప్‌స్టిక్‌తో పెదవుల అందాన్ని పెంచుకోండి.. అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందన్నదాంట్లోనూ తప్పు లేదు. అలాగే ఆరోగ్యమే మహాభాగ్యమని గుర్తుంచుకోండి.
గమనిక: ఇంటర్నెట్లో అందుబాటులో వున్న (కొందరు బ్యూటీషియన్స్ అలాగే వైద్య నిపుణుల నుంచి సేకరించినది) సమాచారం. కేవలం అవగాహన కోసమే.
