Sun Glasses Beauty Healthy.. గాగుల్స్.. సన్ గ్లాసెస్.. ఇవి ధరిస్తే, అందం మరింత రెట్టింపవుతుంది. అందంతో పాటూ, కంటికి రక్షణగానూ వుంటుంది.
నేరుగా సూర్య కాంతి కంటికి తగలకుండా.. దుమ్ము, ధూళి వంటివి కళ్లలో పడకుండా వుండేందుకు గాగుల్స్ వాడుతుంటాం.
అలాగే కొందరు స్టైలిష్ లుక్ కోసం కూడా గాగుల్స్ యూజ్ చేస్తుంటారు. మరి, గాగుల్స్ వాడకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? వాటిని ఎలా ఎంచుకోవాలి.? ఇప్పుడు తెలుసుకుందాం.
Sun Glasses Beauty Healthy.. గాగుల్స్ (సన్ గ్లాసెస్) ఎలాంటివి ఎంచుకోవాలి.?
ముఖ్యంగా సన్ గ్లాసెస్ ఎంచుకునేముందు అవి ఖచ్చితంగా UV ప్రొటెక్షన్ కలిగి వున్నాయో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం.
అలాగే, నాణ్యత తక్కువగా వున్న లెన్సెస్ని వాడడం వల్ల కంటి లోపల రెటీనా పొర దెబ్బ తింటుంది. తద్వారా కంటి చూపు సమస్యలు వచ్చే ప్రమాదముంది.

అలాగే, నాణ్యత తక్కువగా వున్న గాగుల్స్‌ని అధికంగా వాడడం వల్ల ఏజ్ రిలేటెడ్‌గా వచ్చే కంటి చూపు సమస్యలు ఎర్లీగా వచ్చే ప్రమాదమూ లేకపోలేదు.
కొన్ని రకాల లెన్సెస్, వాటి రంగులు కంటికి ఒత్తిడిని తీసుకొస్తాయ్. తద్వారా తలనొప్పి సమస్యలూ తలెత్తే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: బ్రాండ్ అంబాసిడర్ దీపిక పదుకొనె.!
ఎప్పుడూ గాగుల్స్ ధరించేవారిలో కళ్లు సెన్సిటివ్‌గా మారిపోతాయ్. కొద్దిపాటి కాంతిని కూడా చూడలేవు. ఇదీ మరీ ప్రమాదంగా ఘోచరిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సో, స్టైల్ మరియు అందం కోసం మాత్రమే గాగుల్స్ వాడాలనుకుంటే.. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి.
గమనిక: ఇంటర్నెట్లో అందుబాటులో వున్న (కొందరు బ్యూటీషియన్స్ అలాగే వైద్య నిపుణుల నుంచి సేకరించినది) సమాచారం. కేవలం అవగాహన కోసమే.
