Diwali Telugu Movies Disaster.. మూడు స్ట్రెయిట్ సినిమాలు, ఓ డబ్బింగ్ సినిమా.. వెరసి మొత్తంగా నాలుగు సినిమాలు దీపావళి పండగ నేపథ్యంలో విడుదలయ్యాయ్.
వాటిల్లో ఒకటి కాకపోతే, ఒకటైనా బావుండాలి కదా.! ప్చ్.. మొత్తంగా నాలుగూ ఔట్.! కుప్పలు తెప్పలుగా ఫ్రీ టిక్కెట్లు పంచుకున్నారు.. అయినా, ప్రయోజనం శూన్యం.
ముందుగా విడుదలైన ‘మిత్ర మండలి’ రెండో రోజుకే అడ్రస్ లేకుండా పోయింది. ఆ తర్వాత వచ్చిన ‘తెలుసు కదా’, ‘డ్యూడ్’ కూడా ఔట్.!

‘కె-ర్యాంప్’ పరిస్థితీ అగమ్యగోచరం. వున్నవాటిల్లో ఏది బెటర్.? అంటే, ఏది వరస్ట్.. అన్న కేటగిరీలో ‘మిత్ర మండలి’కి చోటు దక్కింది.
యూత్ ‘తెలుసు కదా’ సినిమాతో కనెక్ట్ అయితే, అదే యూత్, ‘కె-ర్యాంప్’కి కూడా కొంత కనెక్ట్ అవుతున్నమాట వాస్తవం.
ఆ ‘కొంత’ ఎంతంటే, సినిమాని యావరేజ్..గా నిలిపేంత కూడా కాదన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఎందుకీ పరిస్థితి.?
పెద్ద సినిమాల్లేకపోవడం లోటే..
దీపావళికి పెద్ద సినిమా ఒక్కటీ రాకపోవడం పెద్ద మైనస్ తెలుగు సినీ పరిశ్రమకి. పోనీ, పెద్ద సినిమా వచ్చిందే అనుకుందాం.. అది కూడా ఫ్లాపయితేనో.?
పెద్ద సినిమాల లెక్కలు వేరు.. పండగకి పెద్ద హీరోల్ని చూడ్డానికి ఆడియన్స్ కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ చూపించే అవకాశం వుంటుంది.

దీపావళికి రెండు పెద్ద సినిమాలు రెండు చిన్న సినిమాలు సరైన టైమ్ గ్యాప్‌తో రిలీజ్ అయితే, పరిస్థితి బావుండేది కదా.? చెత్త ప్లానింగ్.. ప్రతిసారీ కొంప ముంచుతోంది.
పెద్ద సినిమాలు హిట్టయితే, చిన్న సినిమాలకు ఓవర్ ఫ్లోస్ వుంటాయ్. అదే, చిన్న సినిమాలు ఫ్లాపయితే.. అంతే సంగతులు, సీజన్ వృధా.!
Also Read: సన్ గ్లాసెస్ వాడుతున్నారా? మీరివి తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
‘తెలుసు కదా’, ‘కె-ర్యాంప్’ సినిమాల్ని మరీ ‘చిన్న సినిమాలు’ అనేయడం సబబేనా.? అన్న ప్రశ్న రావొచ్చు. మరీ చిన్నవి కావుగానీ, ఆ స్థాయికి కుచించుకుపోయాయి.. ‘కంటెంట్’ వల్ల.
ఫ్యామిలీ ఆడియన్స్, ఈ రెండు సినిమాల్నీ పట్టించుకోలేదు. వల్గర్ కంటెంట్ వల్లనే ఈ పరిస్థితి ఆ రెండు సినిమాలకీ.. అన్నది అందరికీ తెలిసిన విషయమే.

ఆయా సినిమాల గురించి ఇండస్ట్రీలో జరుగుతున్న టాక్ ఏంటో తెలుసా.? సినిమా కోసం పంచిన ‘ఫ్రీ’ టిక్కెట్లు కూడా దండగ.. అని.!
ఎచ్చులకి పోయి, సినీ జర్నలిస్టుల ద్వారా.. ఇతర సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల ద్వారా వందల్లో టిక్కెట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో పంచగలిగారు. కానీ, అది వృధా ప్రయాసే అయ్యింది.
‘ఎవరేమనుకున్నా మా సినిమా హిట్టే’ అని తొలి రోజు ‘సక్సెస్ మీట్’ పెట్టినా, వెనక్కి వెళ్ళి వెక్కి వెక్కి ఏడవాల్సిన పరిస్తితి ఆయా చిత్రాల నిర్మాతలది. ఇది గ్రౌండ్ రియాలిటీ.!
