Tooth Paste Cancer Elements.. మీ టూత్ పేస్టులో ఉప్పు వుందా.?
మా టూత్ పేస్టులో చార్కోల్ శక్తి వుంది.! జెల్ శక్తి.. మీ పళ్ళకు తళతళ్ళాడే మెరుపునిస్తుంది తెలుసా.?
బోల్డన్ని ప్రకటనలు చూశాం ఇలాంటివి.! సినీ తారలు.. అందునా, అందాల భామలు.. ఇలాంటి యాడ్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంటారు.
సెలబ్రిటీల పళ్ళు తళతళా మెరిసిపోతుంటాయ్.. ఆయా వాణిజ్య ప్రకటనల్లో. కానీ, ఆయా సెలబ్రిటీలు, ఆయా టూత్ పేస్టుల్ని వాడతారా.? ఛాన్సే లేదు.!
ఇంతకీ, ఈ ప్రకటనల గోలేంటి.? పైన హెడ్డింగులోని ‘మీ టూత్ పేస్టులో క్యాన్సర్ వుందా’ అన్న అంశం తాలూకు కథేంటి.?
Tooth Paste Cancer Elements.. టూత్ పేస్టుల్లో ఏం వాడుతున్నారు.?
టూత్ పేస్టుల తయారీలో అత్యంత హానికారక పదార్థాలు వినియోగిస్తున్నారంటూ.. ఓ వాదన తెరపైకొచ్చింది.. అదీ ఓ వార్తా కథనం రూపంలో.
ఓ ప్రముఖ దిన పత్రికలో ఈ వ్యవహారాలు అచ్చయ్యేసరికి, అంతా అవాక్కయ్యారు. ఆ వివరాలు చూస్తే, ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవడం ఖాయం.
బ్రష్ చేసినప్పుడు ఎక్కువ నురుగు రావడానికి సబ్బుల్లో, షాంపూల్లో వినియోగించే ‘ఎస్ఎల్ఎన్’ అనే ప్రమాదకర రసాయనాన్ని టూత్ పేస్టుల్లో వాడేస్తున్నారట.
పేస్టుని తెల్ల రంగులోకి తెచ్చేందుకోసం టైటానియం డయాక్సైడ్ అనే రసాయనాన్ని వినియోగిస్తారట. ఇది క్యాన్సర్ కారకమట.

కారగీసన్ అనే రాసాయనాన్ని పేస్టు గట్టిపడకుండా వుండేందుకోసం వినియోగిస్తారనీ, అది జీర్ణాశయ సంబంధిత అనారోగ్య సమస్యల్ని తెస్తుందనీ చెబుతున్నారు.
పారాబెన్ ప్రిజర్వేటివ్, ఫ్లోరైడ్, ప్రొపైలిన్ గ్లైకాల్.. ఇలా చాలా రసాయనాల్ని టూత్ పేస్టుల్లో మోతాదుకి మించి విచ్చలవిడిగా వాడేస్తున్నాయట ఆయా టూత్ పేస్టుల తయారీ సంస్థలు.
ఈ తరహా రసాయనాలు, నోటిలో సహజసిద్ధంగా పెరిగే మంచి బ్యాక్టీరియాని సైతం చంపేస్తాయి. తద్వారా చెడు బ్యాక్టీరియా నోట్లో పెరిగిపోతుంది. శరీరమంతటా అది వ్యాపిస్తుంది.
మరి, దంతాల్ని శుభ్రం చేసుకోవడమెలా.?
మరి, దంతాలు శుభ్రం చేసుకోవడానికి ఏం వాడాలి.? ఒకప్పుడు, పేడతో పిడకల్ని చేసి.. అవి కాల్చడం ద్వారా వచ్చే బూడిదని పళ్ళు తోమడానికి వాడేవారు.
పిడకలు, వంట చేయడానికి వినియోగించేవారన్న సంగతి తెలిసిందే. ఇక, వేప పుల్లతో దంతాల్ని శుభ్రం చేసుకోవడం తెలిసిన విషయమే.!
వేపలో వుండే ఔషధ గుణాలు, దంతాలకు మేలు చేస్తాయి. జీర్ణాశయ సంబంధిత సమస్యల్నీ తొలగిస్తాయి. కానీ, వేప పుల్లని వాడేవారు ఇప్పుడు ఎక్కడా కనిపించరు.
Also Read: పొలిటికల్ లిక్కర్.. పాపం అందరిదీ.!
మార్కెట్లో లభిస్తున్న టూత్ పేస్టుల గురించి.. కొంతమంది ‘మీ టూత్ పేస్టులో క్యాన్సర్ వుందా.?’ అంటూ సెటైర్లేయడం ఇటీవలి కాలంలో చూస్తున్నాం.!
టూత్ పేస్టుల్లో అసలేమేం వాడుతున్నారు.? వాటి వల్ల కలిగే దుష్ఫలితాలేంటి.? అన్నదానిపై ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని, ప్రజలకు భరోసా కల్పించే కార్యక్రమాలు చేపట్టాల్సి వుంది.
