Lokah Flop In Telugu.. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘లోక’. తెలుగులోకి ‘కొత్త లోక’గా ఈ సినిమా విడుదలైంది.
‘కొత్త లోక’ కొంచెం అటూ ఇటూగా తెలుగులో ఆడినా, ‘లోక’ మాత్రం పెద్ద హిట్. దాదాపు 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది ‘లోక’.!
మలయాళంలో అతి పెద్ద హిట్‌గా ‘లోక’ నిలవడం, కళ్యాణి ప్రియదర్శన్కి లేడీ సూపర్ స్టార్.. అనే ఇమేజ్ రావడం తెలిసిన విషయాలే.!
అయితే, తెలుగులో గనుక ‘లోక’ సినిమా డైరెక్టుగా తెరకెక్కి వుంటే, ఫ్లాప్ అయి వుండేదని ప్రముఖ నిర్మాత నాగ వంశీ సెలవిచ్చాడు.
Lokah Flop In Telugu.. ‘మాస్ జాతర’కి ముందర ఎందుకీ తుత్తర.?
‘మాస్ జాతర’ సినిమాతో నాగవంశీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ‘వార్-2’ డబ్బింగ్ సినిమాతో, నాగ వంశీ చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు.
హృతిక్ రోషన్‌ని తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేస్తున్నాం.. అంటూ, ‘వార్-2’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగవంశీ చేసిన అతి.. అంతా ఇంతా కాదు.!
అంతే కాదు, హిందీ బెల్ట్ కంటే, కనీసం ఒక్క రూపాయి అయినా ‘వార్-2’ తెలుగు వెర్షన్‌కి తెలుగు రాష్ట్రాల్లో వచ్చి తీరాలంటూ.. మరింత ‘అతి’ ప్రదర్శించాడు నాగవంశీ.
ఆ ‘అతి’ కాస్తా, ‘వార్-2’ కొంప ముంచేసిందన్న విమర్శలూ లేకపోలేదు.! ఇక, ఇప్పుడేమో, ‘లోక’ సినిమా తెలుగులో తెరకెక్కి వుంటే, ఫ్లాప్ అయ్యేదని చెబుతున్నాడు.
Also Read: అతడు, ఆమె.. ఇంకొక ‘డ్యూడ్’.!
సినిమాలో కంటెంట్, ప్రేక్షకులకి నచ్చితే.. ఆ సినిమా సక్సెస్ అవుతుంది. ఏ సినిమా అయినా, విమర్శల్ని దాటి, సక్సెస్ అవ్వాల్సిందే.
విపరీతంగా ట్రోలింగ్ ఎదుర్కొన్న సినిమాలూ హిట్ అవుతుంటాయి. రివ్యూలు నెగెటివ్‌గా వచ్చినా సక్సెస్ అయిన సినిమాులంటాయి.
ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకోగలిగితే, అసలంటూ ఫ్లాప్ సినిమాలే రావు. ఏ నిర్మాత కూడా కావాలని ఫ్లాప్ సినిమా తీయడు కదా.!
మాట ముఖ్యం. పద్ధతి ముఖ్యం.! అది లేకనే, పదే పదే ట్రోలింగ్ ఎదుర్కొంటుంటాడు నిర్మాత నాగ వంశీ.
