Pawankalyan Vs Raghurama Krishnaraju.. పశ్చిమగోదావరి జిల్లాలో పేకాట ‘పంచాయితీ’ కొత్త మలుపు తిరిగింది.
ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తనకు వచ్చిన ఫిర్యాదుల మేరకు, పోలీస్ ఉన్నతాధికారులను నివేదిక కోరారు.
ఈ వ్యవహారంపై ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పేకాట, పశ్చిమ గోదావరి జిల్లాలో సర్వసాధారణం.. అనేశారు రఘురామ.
అంతలోనే, పేకాటపై కొన్ని నెలలుగా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందనీ రఘురామ చెప్పుకొచ్చారు. పనిలో పనిగా, వివాదాస్పద పోలీస్ అధికారిని వెనకేసుకొచ్చారు.
Pawankalyan Vs Raghurama Krishnaraju.. రఘురామ సర్టిఫికెట్.!
‘ఆ పోలీస్ అధికారి నాకు తెలిసి నిజాయితీ పరుడు..’ అంటూ రఘురామ ‘సర్టిఫికెట్’ ఇవ్వడం, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది.
‘తన శాఖల్ని మాత్రమే కాకుండా, ఇతర శాఖల గురించీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీస్తుండడం మంచిదే..’ అని రఘురామ చేసిన సెటైరికల్ వ్యాఖ్యలూ హాట్ టాపిక్ అయ్యాయి.
వాస్తవానికి, ఈ వ్యవహారంపై పోలీస్ ఉన్నతాధికారుల నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివేదిక కోరగా, ఏపీ హోం మంత్రి కూడా స్పందించారు.
Also Read: మీ బిర్యానీలో ‘చికెన్’ వుందా.?
‘ఇది ఎన్డీయే ప్రభుత్వం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివేదిక కోరడం తప్పు కాదు..’ అని సాక్షాత్తూ హోంమంత్రి సెలవిచ్చాక, రఘురామ సదరు పోలీస్ అధికారికి సర్టిఫికెట్ ఎలా ఇస్తారు.?
పోలీస్ ఉన్నతాధికారులు నివేదిక ఇవ్వాలి, అందులో సదరు వివాదాస్పద అధికారి గురించిన సమాచారం బయటకు రావాలి. ఈలోగా, రఘురామ ఎందుకు తొందరపడ్డారన్నదే కీలకం ఇక్కడ.

ఉండి ఎమ్మెల్యే రఘురామ వ్యాఖ్యల వ్యవహారం.. టీడీపీలో చర్చనీయాంశమవుతోంది. గతంలో వైసీపీలో వుండి, వైసీపీకి వ్యతిరేకంగా పని చేశారు రఘురామకృష్ణరాజు.
ఇప్పుడు, అధికార కూటమికి సంబంధించిన ఎమ్మెల్యే అయి వుండీ, కీలకమైన డిప్యూటీ స్పీకర్ పదవిలో వుంటూ.. ఇలా వ్యవహరించడమేంటి.? అన్న అనుమానాలు తలెత్తడం సహజమే.
ప్రధానంగా, భీమవరం చుట్టూ ఈ పేకాట పంచాయితీ నడుస్తోంది. భీమవరం శాసన సభ సీటు, జనసేన ఖాతాలో వుంది.
స్థానిక జనసేన నాయకత్వం నుంచి సైతం, పేకాట పంచాయితీపై, జనసేనాని అలానే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదుల మీదనే డిప్యూటీ సీఎం స్పందించారు.
