YSRCP Cinema Pichhi.. మంత్రులుగా వుండి, సినిమాలకు ‘నెగెటివ్ రివ్యూలు’ చెప్పుకునే స్థాయికి వైసీపీ దిగజారిపోయింది గతంలో.! 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ఇదొక కారణం.
పవన్ కళ్యాణ్ సినిమాలకు టిక్కెట్ రేట్లు తగ్గించడమే ‘పరిపాలన’ అని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావించారంటే, ఏ స్థాయికి వైసీపీ ‘పిచ్చి’ ముదిరిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత కూడా, వైసీపీకి ‘సినిమా పిచ్చి’ తగ్గలేదు.
ఏదన్నా సినీ వేదికపై, సినీ ప్రముఖులెవరైనా, జనసేనకు అనుకూలంగా మాట్లాడితే చాలు, ‘బ్యాన్’ అంటూ నిస్సిగ్గుగా వైసీపీ సోషల్ మీడియా కూలీలు చెలరేగిపోతున్నారు.
YSRCP Cinema Pichhi.. సినిమా.. రాజకీయం.. వేర్వేరు కాదు.!
ఒకప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడు పరిస్థితులు వేరు. సినిమాల్నీ, రాజకీయాల్నీ వేర్వేరుగా చూడలేని పరిస్థితి. అదే సమయంలో, ఎవరిష్టం వారిది.
ఫలానా రాజకీయ పార్టీపై, ఫలానా సినీ ప్రముఖుడికి అభిమానం వుండడం, దాన్ని సినీ వేదికలపై చాటుకోవడం.. నిజానికి, వింతేమీ కాదు.

రాజకీయ పార్టీల కోసం, సినిమాలు తీస్తున్న రోజులివి. గతంలో, వైసీపీ కోసం సినిమాలు చేశారు కొందరు సినీ ప్రముఖులు.
రామ్ గోపాల్ వర్మ లాంటోళ్ళు, వైసీపీ కోసం.. ఇతర రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా సినిమాలు చేయడం చూశాం.
నచ్చితే చూడొచ్చు.. నచ్చకపోతే మానెయ్యొచ్చు..
సినిమాలకు రాజకీయ సెగ మామూలే. కానీ, ఈ ‘బ్యాన్’ పిచ్చి ఏంటి.? నచ్చకపోతే, చూడ్డం మానేస్తారు.. నచ్చితేనే సినిమాలు చూస్తారు.! ఎంత పెద్ద స్టార్ విషయంలో అయినా ఇదే జరిగేది.!
వైసీపీ వాలకం చూస్తేంటే, రాజకీయాలు మానేసి.. పూర్తిగా, సినిమాల మీద ఫోకస్ పెట్టేలా వుంది పరిస్థితి. 2024 ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత కూడా వైసీపీ బుద్ధి మారకపోతే ఎలా.?
ఆత్మ విమర్శ చేసుకోవాలి.. సినిమాలపై కామెంట్లేసి, రాజకీయంగా నష్టపోయిన విషయాన్ని వైసీపీ అధినాయకత్వం గుర్తెరగాలి.
Also Read: టర్కీ.. తుర్కియే.! అంతా అయిపాయె.!
సోషల్ మీడియాలో పోస్టులు పెడితే, రాజకీయంగా బలపడలేమని వైసీపీ తెలుసుకోవాలి. కానీ, ఆత్మ విమర్శ చేసుకునేంత తీరిక వైసీపీ అధినాయకత్వానికి లేకుండా పోయింది.
దాంతో, వైసీపీ సోషల్ మీడియా కూలీలకి, సినిమాల్ని బ్యాన్ చేయడమే నిఖార్సయిన రాజకీయం.. అనే పిచ్చి ముదిరిపోయింది.!
‘భైరవం’ సినిమా మీద తాజాగా వైసీపీ సోషల్ మీడియా కూలీలు పైత్యం ప్రదర్శిస్తున్నారు.