Shreyas Iyer Hospitalized.. ఆస్ట్రేలియా – టీమిండియా జట్ల మధ్య ఇటీవల జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన సంగతి తెలిసిందే.
ఫీల్డింగ్ సమయంలో, శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. బాధతో విలవిల్లాడాడు. వెంటనే, అతనికి ప్రాథమిక వైద్య చికిత్స అందించారు.
అనంతరం, శ్రేయస్ అయ్యర్‌ని ఆసుపత్రికి తరలించి, వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
తొలుత గాయం చిన్నదేనని అంతా అనుకున్నారు. కానీ, గాయం తీవ్రత ఎక్కువేనని వైద్య పరీక్షల్లో నిర్ధారించారు వైద్యులు.
Shreyas Iyer Hospitalized.. మరిన్ని వైద్య పరీక్షలు.?
ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్‌కి, ఐసీయూలో వుంచి అవసరమైన వైద్య చికిత్స అందిస్తున్నారు. మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించే అవకాశముంది.
ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల, పరిస్థితి కొంత ఆందోళనకరంగా వున్నా, ప్రాణానికి ప్రమాదమేమీ లేదని వైద్యులు చెబుతున్నారు.
కొన్ని రోజులపాటు ఆసుపత్రిలోనే శ్రేయస్ అయ్యర్, వైద్యుల పర్యవేఖ్షణలో వుండాల్సి వస్తుందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
Also Read; బాబోయ్ అమ్రికా.! ఫర్లేదు.. మరీ అంత భయం లేదు లేవోయ్.!
క్రికెట్ సందర్భంగా ఆటగాళ్ళు గాయాల పాలవడం కొత్తేమీ కాదు. చాలా అరుదుగా, మైదానంలో తీవ్రమైన గాయాల పాలవుతుంటారు క్రికెటర్లు.
చాలా చాలా చాలా అరుదుగా మైదానంలోనే క్రికెటర్లు ప్రాణాలు విడిచిన సందర్భాలూ వున్నాయి.
కాగా, శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకోవాలని అతని అభిమానులు వివిధ ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
