Priyanka Chopra Jonas Remuneration.. గత కొంతకాలంగా, ఇండియన్ సినిమా స్క్రీన్ మీద పెద్దగా కనిపించడంలేదు ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా.!
ఇప్పుడామె ప్రియాంక చోప్రా జోనాస్.! హాలీవుడ్ బ్యూటీ.! తెలుగులో, మహేష్‌బాబు సరసన రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోంది ప్రియాంక.
రాజమౌళి – మహేష్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాని తెలుగు సినిమా అనీ, ఇండియన్ సినిమా అనీ.. అనడం కంటే, ఇంటర్నేషనల్ ఫిలిం.. అనడం సబబేమో.!
Priyanka Chopra Jonas Remuneration.. ప్రియాంక రెమ్యునరేషన్‌పై గాసిప్పులే గాసిప్పులు..
హాలీవుడ్ స్థాయికి ఎదిగాక, ప్రియాంక రెమ్యునరేషన్.. కళ్ళు చెదిరే స్థాయికి చేరుకున్నమాట వాస్తవం. ఆమెని బాలీవుడ్ నిర్మాతలే భరించలేకపోతున్నారు.
కానీ, రాజమౌళి తన సినిమా కోసం ప్రియాంక చోప్రాని తీసుకొచ్చాడు. ఈ క్రమంలో, ప్రియాంక రెమ్యునరేషన్ ఎంత.? అన్న చర్చ గత కొంతకాలంగా జరుగుతోంది.
ఫ్యాన్ వార్స్‌లో భాగంగా, మహేష్‌బాబుని కించపరుస్తూ, మహేష్ కంటే ప్రియాంక రెమ్యునరేషన్ ఎక్కువ.. దీన్ని ప్రియాంక సినిమాలా చూడాలంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కనిపిస్తున్నాయి.
నో డౌట్.. రికార్డు స్థాయిలోనే..
రాజమౌళి – మహేష్ – ప్రియాంక కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా బడ్జెట్, అంచనాలకు మించి వుండబోతోందన్నది నిర్వివాదాంశం.
బడ్జెట్ అంటే, అందులో నటీనటుల రెమ్యునరేషన్లు కూడా వుంటాయ్ కదా.! మహేష్ కంటే, ప్రియాంకకే ఎక్కువ రెమ్యునరేషన్ వుండొచ్చు.
ప్రియాంక చోప్రా జోనాస్ కంటే కూడా ఎక్కువగా రాజమౌళి రెమ్యునరేషన్ వుండొచ్చన్నది ఓ అంచనా. అందులోనూ నిజం లేకపోలేదు.!
Also Read: ఇదే ‘మాస్ జాతర’కి అడ్వాంటేజ్.!
నటీనటుల సంగతి పక్కన పెడితే, హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ సినిమా కోసం వినియోగిస్తున్నారు.
రాజమౌళి అంటే, కేవలం దర్శకుడు మాత్రమే కాదు కదా.! సినిమాని మార్కెటింగ్ చేసుకోవడంలో దిట్ట.! కాబట్టే, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాడు.
గాసిప్పుల సంగతి పక్కన పెడితే, రాజమౌళి, మహేష్, ప్రియాంక.. ముగ్గురూ, ‘త్రీ డిజిట్’ రెమ్యునరేషన్ (కోట్లలో) అందుకుంటున్నారన్నది ఓ అంచనా.
