Sonakshi Sinha Jatadhara Tollywood.. సోనాక్షి సిన్హా తెలుసు కదా.? బాలీవుడ్ బ్యూటీ.! తెలుగులో రజనీకాంత్ సరసన ‘లింగ’ అనే సినిమాలో నటించింది.
దక్షిణాదిలో అదే ఆమెకి తొలి సినిమా.! ‘లింగ’ తర్వాత, టాలీవుడ్ నుంచి కూడా ఆఫర్లు వచ్చినా, బాలీవుడ్ కమిట్మెంట్స్ నేపథ్యంలో, సౌత్‌లో సినిమాలు చేయలేకపోయింది సోనాక్షి.
ఇన్నేళ్ళకు స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తోంది సోనాక్షి సిన్హా. ప్రముఖ నటుడు శతృఘన్ సిన్హా కుమార్తె సోనాక్షి. ‘దబాంగ్’ సినిమాతో దేశవ్యాప్తంగా స్టార్‌డమ్ సంపాదించుకుందీ బ్యూటీ.
తాజాగా, తెలుగులో ‘జటాధర’ సినిమాతో తెరంగేట్రం చేస్తోన్న సోనాక్షి, బాలీవుడ్‌కి టాలీవుడ్ పాఠాలు నేర్పించడం షురూ చేసేసి, అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
Sonakshi Sinha Jatadhara Tollywood.. అక్కడికీ.. ఇక్కడికీ అదే తేడా.!
‘లింగ్’ సినిమా షూటింగ్ సమయంలోనూ, ‘జటాధర’ షూటింగ్ సమయంలోనూ, తాను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నానని సోనాక్షి సిన్హా చెప్పుకొచ్చింది.

బాలీవుడ్ సినిమాల కోసం అర్థ రాత్రి వేళ కూడా షూటింగ్ చేయాల్సి వస్తుందనీ, అదే.. తెలుగులో ఆ సమస్య వుండదని సోనాక్షి వ్యాఖ్యానించింది.
‘ఉదయం తొమ్మిది గంటలకు షూటింగ్ ప్రారంభమైతే, సాయంత్రం ఆరు గంటలకు ప్యాకప్ అయిపోతుంది.. ఆ తర్వాత షూటింగ్ చేయరు తెలుగులో.. ఇది మంచి విషయం’ అని చెప్పింది సోనాక్షి.
సమయపాలన..
‘సమయ పాలన విషయంలో టాలీవుడ్‌ని చూసి, బాలీవుడ్ చాలా చాలా నేర్చుకోవాలి’ అంటూ, సోనాక్షి సిన్హా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read: దెయ్యాల పండగ ‘Halloween’లో మన ‘కొరివి దెయ్యాలు’.!
‘జటాధర’ సినిమాలో నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలో సోనాక్షి కనిపించనుంది. ‘ధన పిశాచి’గా నటిస్తోంది సోనాక్షి సిన్హా ‘జటాధర’లో.
‘ఆమె కళ్ళతోనే భయపెట్టేయగలదు..’ అంటూ సోనాక్షి గురించి, ‘జటాధర’ హీరో సుధీర్‌బాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
