అనసూయ ఆ విషయంలో అస్సలు తగ్గేదే లే.!
Anasuya Questions Vijay Again.. ముగిసిపోయిన గొడవ.. అంటూనే, మళ్ళీ సాగదీసింది అనసూయ భదర్వాజ్.. అదీ, విజయ్ దేవరకొండతో వివాదం గురించి మాట్లాడుతూ.!
‘దాని గురించి మాట్లాడదలచుకోలేదు..’ అని చెప్పి మరీ, మళ్ళీ ఆ వివాదాన్ని ఎందుకు అనసూయ (Anasuya Bharadwaj) కెలుక్కున్నట్టు.?
నిజానికి, ఈ విషయంలో అనసూయని (Anasuya Bharadwaj) తప్పుపట్టడానికేమీ లేదు. ఓ సినిమా ఫంక్షన్‌లో విజయ్ దేవరకొండ, బూతులు వాడాడు. అనసూయ మీద కాదు లెండి.!
కానీ, ఓ బాధ్యతగల పౌరురాలిగా.. ఓ మహిళగా.. సగటు తల్లిగా.. ఆ విషయమై అనసూయ గుస్సా అయ్యింది. దాంతో, అనసూయ మీద విజయ్ దేవరకొండ అభిమానులు బూతులతో రెచ్చిపోయారు.
Anasuya Questions Vijay Again.. ఇట్నుంచి అటు.. అట్నుంచి ఇటు..
విజయ్ దేవరకొండ నటించిన సినిమా ఏదన్నా వస్తే, అనసూయ ఏదో ఒక కామెంట్ చేయడం, ఆమెని విజయ్ అభిమానులు ట్రోల్ చేయడం సర్వసాధారణమైపోయింది.
‘మిమ్మల్నే ఆ ప్రశ్న అడగాలనుకుంటున్నాను.. మీరెందుకు, ఈ విషయమై విజయ్ దేవరకొండని (Vijay Deverakonda) నిలదీయలేదు.?’ అంటూ అనసూయ, తాజాగా మీడియాపై గుస్సా అయ్యింది.
ఇంకేముంది.? మళ్ళీ కథ మొదటికి వచ్చేసింది. అనసూయని మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు విజయ్ దేవరకొండ అభిమానులు షరామామూలుగానే.
అలాంటి ట్రోలింగ్ విషయమై మళ్ళీ అనసూయ సోషల్ మీడియా వేదికగా స్పందించడమూ మామూలే. ఎటాక్.. కౌంటర్ ఎటాక్.. ఇదొక నిరంతర ప్రక్రియ అంతే.!
Also Read: డబుల్ ఇస్మార్ట్.! వాళ్ళిద్దరూ లేకపోతేనేం ‘బాంబ్’ వుందిగా.!
అనసూయ భరద్వాజ్ తన తాజా చిత్రం ‘సింబా’ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో మీడియా నుంచి విజయ్ దేవరకొండ విషయమై ప్రశ్నల్ని ఎదుర్కొంది. ఈ సందర్భంలో పై విధంగా స్పందించింది.
ఇదిలా వుంటే, అనసూయ విషయమై ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ స్పందించింది లేదు. ఆయన మాత్రం ప్రతిసారీ లైట్ తీసుకుంటున్నాడు.
నిజానికి, మీడియా కూడా అనసూయ (Anasuya Bharadwaj) విషయమై విజయ్ దేవరకొండని ప్రశ్నించింది లేదు.!