Girijana Power Pawan Kalyan.. గిరిజన ప్రాంతమది. పేరేమో ‘గూడెం’. దేశానికి స్వాంత్ర్యం సిద్ధించి దశాబ్దాలు గడుస్తున్నా, ఆ గ్రామానికి విద్యుత్ లేదు.!
ఔను, గిరిజన గ్రామం కదా.! పైగా, అక్కడున్నవి చాలా తక్కువ కుటుంబాలు.. జనాభా చాలా చాలా తక్కువ. ఓట్లు లేకపోతే, రాజకీయ నాయకులు పట్టించుకోరు.. పట్టించుకోలేదు.!
కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ గిరిజనుల వెతల్ని స్వయంగా తెలుసుకున్నారు. గిరిజన ప్రాంతాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు.
చెప్పిన మాట ప్రకారం, అధికారులతో కలిసి సుదీర్ఘంగా కసరత్తులు చేశారు. ఫలితం.. మొత్తం 17 కుటుంబాలు, తొలిసారిగా విద్యుత్ వెలుగుల్ని చూశాయి.
పవర్ తెచ్చిన వెలుగులు..
ఇంటికి ఐదు బల్బలు, ఓ ఫ్యాన్‌ని కూడా ప్రభుత్వం తరఫున, గిరిజనులకు అందేలా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారు.
డిప్యూటీ సీఎం చిత్తశుద్ధి వల్లనే, తమ గ్రామానికి విద్యుత్ వెలుగులు వచ్చాయంటూ, ‘గూడెం’ గ్రామస్తులు, పవన్ కళ్యాణ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.

అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం ‘గూడెం’ గ్రామం పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది.! ఆ గ్రామం గురించి, నెటిజనం వాకబు చేయడం ప్రారంభించారు.
కొద్ది నెలల క్రితం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నక్సల్ ప్రభావిత గిరిజన ప్రాంతాల్లో స్వయంగా పర్యటించిన సంగతి తెలిసిందే.
అక్కడి గిరిజనులు, నడవడానికి పాద రక్షలు లేక ఇబ్బంది పడుతుండడాన్ని చూసి చలించిపోయారు పవన్ కళ్యాణ్. అక్కడి జనం అందరికీ, పాద రక్షల్ని అందించారు.
Also Read: ‘పెద్ది‘గాడి ‘అచ్చియ్యమ్మ’.! జాన్వీ కపూర్ ‘లుక్కు’ కిర్రాకు.!
గిరిజన ప్రాంతాల్లో ప్రజలు, వైద్యం కోసం పడుతున్న యాతనల నుంచి విముక్తి కల్పించేందుకోసం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాలకు రోడ్లను వేయిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని.. అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంటూ, తన శాఖల పరిధిలో, పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రశంసలు దక్కుతున్నాయి.
స్వాతంత్ర్యం సిద్ధించాక.. దశాబ్దాలుగా గిరిజన ప్రాంత ప్రజలు రోడ్లు లేక, విద్యుత్ లేక ఇబ్బందులు పడుతున్నారంటే, గత ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి శూన్యమనే కదా అర్థం.?
