Chinmayi Sripada Publicity Stunts.. సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయిని తమిళ సినిమాల్లో చాన్నాళ్ల క్రితమే బ్యాన్ చేశారు.
ఓ సినీ ప్రముఖుడిపై అసత్యపు ఆరోపణలు చేసిందనేది చిన్మయిపై తమిళ సినీ పరిశ్రమ మోపిన నింద.
పెద్ద రచ్చే జరిగింది ఈ విషయంపై అప్పట్లో. సినీ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్, చిన్మయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మండన్న ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది.
Chinmayi Sripada Publicity Stunts.. తాళి గోల.!
‘ది గర్ల్ ఫ్రెండ్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో చిన్మయి తాళి గురించి రాహుల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయ్.
తాళి వేసుకోవద్దని తాను చిన్మయికి సూచించినట్లు చెప్పాడు రాహుల్. పైగా చిన్మయిని చెడగొట్టిందని తానేనని కూడా రాహుల్ చెప్పుకున్నాడు.
ఈ క్రమంలో కొందరు నెటిజన్లు.. అటు రాహుల్ రవీంద్రన్నీ, ఇటు చిన్మయిని ధూషిస్తూ బూతులతో చెలరేగిపోయారు.
చిత్రమేంటంటే, ఓ స్పేస్‌లో చిన్మయి జాయిన్ అయ్యి, తన వాదనను గట్టిగా వినిపించే ప్రయత్నం చేసింది. అయితే, చిన్మయి సొంత డబ్బా కొట్టుకుంటోందంటూ ఆ స్పేస్ నిర్వహకులు గుస్సా అయ్యారు.
చిన్మయి బూతులు..
అన్నట్లు, చిన్మయి మాటల్లో కూడా ఒకట్రెండు బూతులు దొర్లాయి ఓ స్పేస్‌లో. సోషల్ మీడియాలో అడ్డదిడ్డమైన రాతలు, అసభ్యకరమైన కూతలు కొత్తేమీ కాదు.
అయితే, తనను బూతులు తిట్టిన నెటిజన్లపై పోలీసులకు ఫిర్యాదు చేసింది చిన్మయి. తమిళనాడులో తనను కొందరు ద్వేషించినా ఇంతలా బూతులు తిట్టలేదనీ, తెలంగాణాలోనే ఈ పైత్యం ఎక్కువైందనీ చిన్మయి చెప్పింది.
దాంతో ఎవరో ఒకరిద్దరు అనామకులు ఏదో వాగితే, తెలంగాణా మొత్తానికి ఆ పాపం అంటిచేస్తావా.? అని కొందరు నెటిజన్లు ఆమెపై మండిపడ్డారు.
ఇంకో పక్క తనను బూతులు తిట్టిన నెటిజన్ల మీద చిన్మయి పోలీసులకు ఫిర్యాదు చేయడం నేపథ్యంలో, పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టడం కూడా జరిగిపోయాయ్.
ఏదేమైనా చిన్మయిని బూతులు తిట్టడం కరెక్ట్ కాదు. అదే సమయంలో నెటిజన్లను రెచ్చగొట్టే ప్రయత్నం చిన్మయి కూడా మానుకోవాలి.
కొసమెరుపేంటంటే, చిన్మయి రచ్చతో ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాకి ఫ్రీ పబ్లిసిటీ వచ్చినా, అదే సమయంలో సినిమాని బాయ్‌కాట్ చేయాలన్న నినాదాలూ పెరిగాయి.
