Prithviraj Sukumaran Kumbha Globetrotter.. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్‌బాబుతో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.!
‘గ్లోబ్‌ట్రోటర్’ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. అసలు ‘గ్లోబ్‌ట్రోటర్’ అంటే ఏంటి.? ఈ విషయమై ఇంటర్నెట్ వేదికగా బోల్డంత రీసెర్చ్ చేసేశారు నెటిజనం.!
అసలంటూ, మహేష్‌బాబుని రాజమౌళి ఈ ‘గ్లోబ్‌ట్రోటర్’ ఫిలింలో ఎలా చూపించబోతున్నాడన్న ఉత్కంఠ, సగటు మహేష్ అభిమానుల్ని వెంటాడుతోంది.
సరిగ్గా, ఈ టైమ్‌లోనే ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ బయటకు వచ్చింది. అయితే, అది మహేష్‌బాబుకి సంబంధించింది కాదు. మలయాళ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్‌కి సంబంధించి.
పృధ్వీరాజ్ సుకుమారన్, ఈ ‘గ్లోబ్‌ట్రోటర్’ ఫిలింలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్ చేస్తున్నాడు.
ఈ మధ్యనే, సోషల్ మీడియా వేదికగా రాజమౌళి, మహేష్, పృధ్వీరాజ్, ప్రియాంక చోప్రా.. తదితరుల మధ్య ఆసక్తికరమైన ట్వీట్ వార్ నడిచింది.
Prithviraj Sukumaran Kumbha Globetrotter.. కుంభ వచ్చేశాడు.?
దానికి కొనసాగింపుగా, మొదట ‘కుంభ’ పాత్రని పరిచయం చేశాడు దర్శకుడు రాజమౌళి. తదుపరి లుక్, ప్రియాంక చోప్రాది కానుంది.!
చివరగా, మహేష్‌బాబు లుక్‌ని రాజమౌళి రివీల్ చేస్తాడు. నవంబర్ 15న, సినిమా టైటిల్ రివీల్ కాబోతోంది.
వీల్ ఛెయిర్‌లో కూర్చుని, పృధ్వీరాజ్ చౌహన్ ఎలా యుద్ధ రంగాన సత్తా చాటుతాడో చూడాల్సి వుంది. ‘స్పైడర్ మ్యాన్’ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ ఒకటి మనకి కనిపిస్తుంటుంది.
Also Read: స్నేక్ బ్యూటీ.! టచ్ చేస్తే, కాటేస్తది జాగ్రత్త.!
‘వారణాసి’ అనే టైటిల్ పరిశీలనలో వున్నా, అదే టైటిల్‌తో ఓ చిన్న సినిమా నుంచి ఇటీవల ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలో ‘గ్లోబ్‌ట్రోటర్’ అసలు టైటిల్ ఏంటన్నది సస్పెన్స్‌గా మారింది.
ఒక్కటి మాత్రం నిజం.. రాజమౌళి అంటే, సమ్‌థింగ్ వెరీ స్పెషల్.! రాజమౌళి ఏం చేసినా, అది సంచలనమే.
ఆ సంచలనాలకు కొనసాగింపుగా ఈ ‘గ్లోబ్‌ట్రోటర్’ అని, పృధ్వీరాజ్ సుకుమారన్ పోస్టర్‌తో ఇంకోసారి నిరూపితమయ్యిందంతే.
