Adavi Puli Pawan Kalyan.. ఎర్ర చందనం స్మగ్లింగ్ కార్యకలాపాల గురించి సినిమాల్లో చూస్తున్నాం. సినిమాల్లో మించి, స్మగ్లింగ్ కార్యకలాపాలు యధేచ్ఛగా సాగుతుంటాయి.
స్మగ్లింగ్ ముసుగులో పర్యావరణానికి హాని కలిగించడమే కాదు, అధికారులపైనా స్మగ్లర్లు దాడులు చేస్తుండడం తెలిసిన విషయాలే.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో, రాజకీయ నాయకుల ప్రమేయంతో యధేచ్ఛగా ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతుంటుంది.
అలాంటి శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
Also Read: విధ్వంసం ఏ స్థాయిలో.? తుపాను హెచ్చరికల్ని ఎలా చూడాలి.?
పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా బాద్యతలు చేపట్టినప్పటినుంచీ, ఎప్పటికప్పుడు శేషాచలం అటవీ ప్రాంతంలో జరుగుతున్న వ్యవహారాలపై నిఘా పెట్టారు.
తాజాగా, పవన్ కళ్యాణ్ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యటించారు. అటవీ ప్రాంతంలోనూ కలియదిరిగారు. వాచ్ టవర్స్ నుంచి, అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు.
Adavi Puli Pawan Kalyan.. అటవీ సంపద సంరక్షణలో రాజీ పడొద్దు..
మంగళం తదితర ప్రాంతాల్లోని ఎర్ర చందనం గొడౌన్లను పరిశీలించారు. పట్టుబడిన ప్రతి ఎర్ర చందనం దుంగకీ ప్రత్యేకంగా బార్ కోడింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అలాగే, వాటికి లైవ్ ట్రాకింగ్ ఏర్పాట్లూ చేయాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఏ ఒక్క ఎర్ర చందనం దుంగ కూడా పక్కదారి పట్టకూడదని అధికారులకు తేల్చి చెప్పారు.
అత్యంత ప్రమాదకరమైన అటవీ ప్రాంతంలో, సుమారు రెండు కిలోమీటర్ల మేర కాలి నడకన పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

ఈ సందర్భంగా పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా అటవీ సంరక్షణ విషయమై పవన్ కళ్యాణ్ చూపుతున్న చొరవని అధికారులు ప్రత్యేకంగా కొనియాడుతున్నారు.
అటవీ సంపద విషయమై అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలనీ, స్మగ్లింగ్ కార్యకలాపాలకు ఆస్కారమివ్వకూడదని అధికారుల్ని ఆదేశించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్.. హాట్ టాపిక్..
కాగా, ఈ పర్యటనలో పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్ హాట్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్ మిలిటరీ తరహా ప్యాంట్ వేశారు. ఆ పైన టీ షర్ట్.. కళ్ళకు గాగుల్స్.. ధరించారు.
‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ఆటిట్యూడ్.. పవన్ కళ్యాణ్ డ్రెస్సింగ్ స్టైల్‌లో కాదు.. ఆయన బాడీ లాంగ్వేజ్‌లో కనిపిస్తుంటుంది. అదే, పవన్ కళ్యాణ్ స్వాగ్ అంటే.
కాకపోతే, ఇలా ట్రెండీ లుక్‌లో.. ఆ పవర్ పదింతలవుతుందన్నది నిర్వివాదాంశం. ‘మోస్ట్ స్టైలిష్ పొలిటీషియన్..’ అనే ట్యాగ్ పవన్ కళ్యాణ్‌కి ఇచ్చేయొచ్చు ఇప్పుడు.. ఈ డ్రెస్సింగ్‌లో.!

షార్ట్ హెయిర్.. కొంచెం గడ్డం.. వెరసి, పవన్ కళ్యాణ్ లుక్.. అదిరిపోయిందంతే.! స్టైలింగ్ పరంగా చూసుకుంటే, పొలిటికల్ ఓజీ పవన్ కళ్యాణ్.. అనేయొచ్చు నిస్సందేహంగా.
డ్రెస్సింగ్ పక్కన పెడితే, పవన్ కళ్యాణ్ దృష్టికి ఏదన్నా సమస్య వెళితే, వెంటనే పరిష్కారమవుతోందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది.

అందుకేనేమో, రాష్ట్ర ప్రజలు తామెదుర్కొంటున్న సమస్యల్ని సోషల్ మీడియా వేదికగా, పవన్ కళ్యాణ్‌కి విన్నవించుకుంటున్నారు.
జనసేన పార్టీ కార్యాలయంలోనూ, ప్రజల వినతుల్ని స్వీకరిస్తూ, వాటికి పరిష్కారం చూపుతున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్.
