RGV Says Sorry Chiranjeevi.. మెగాస్టార్ చిరంజీవికి, రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పాడు.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అప్పుడెప్పుడో వచ్చిన ‘శివ’ సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తుండగా, స్నేహితుడు నాగార్జున కోసం, ‘శివ’ సినిమా రీ-రిలీజ్ గురించి చిరంజీవి స్పందించారు.
ఈ సందర్భంగా ఓ వీడియోను మెగాస్టార్ చిరంజీవి రిలీజ్ చేశారు. ‘శివ’ సినిమా అప్పట్లో సాధించిన ఘన విజయం గురించి ఆ వీడియోలో చిరంజీవి కొనియాడారు.
అక్కినేని నాగార్జున అంటే, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.! ఆ స్నేహంతోనే, చిరంజీవి ఈ వీడియో చేశారు.
RGV Says Sorry Chiranjeevi.. ఆర్జీవీ క్షమాపణ..
చిరంజీవి ‘శివ’ సినిమా గురించి వీడియోలో మాట్లాడటం పట్ల రామ్ గోపాల్ వర్మ హర్షం వ్యక్తం చేశాడు సోషల్ మీడియా వేదికగా.
అంతే కాదు, చిరంజీవికి రామ్ గోపాల్ వర్మ క్షమాపణ కూడా చెప్పాడు. ‘అన్-ఇంటెన్షనల్గా గతంలో తూలనాడినందుకుగాను ఈ క్షమాపణ’ చెబుతున్నట్లు వర్మ పేర్కొన్నాడు.
అయితే, బేషరతు క్షమాపణ చెప్పాల్సిన ఆర్జీవీ, ‘అన్-ఇంటెన్షనల్గా’ అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం, మెగాభిమానులకు అస్సలు నచ్చలేదు.
‘ఆర్జీవీ అనే గ్రామ సింహాన్ని అస్సలు నమ్మలేం. వైసీపీ తరఫున వకాల్తా పుచ్చుకుని, పెయిడ్ ఆర్టిస్టుగా మారిపోయి చిరంజీవి మీద ఆర్జీవీ గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు’ అన్నది మెగాభిమానుల ఆగ్రహం.
అంతే కాదు, శ్రీరెడ్డితో చిరంజీవి తల్లిని దూషించేలా చేసింది కూడా రామ్ గోపాల్ వర్మనే కావడంతో, ‘ఈ నక్క వేషాలు వద్దు’ అంటూ, ఆర్జీవీపై మండిపడుతున్నారు మెగాభిమానులు.
చిరంజీవి శిఖరం..
‘మెగాస్టార్ చిరంజీవి అంటే శిఖరం.! ఆయన్ని చూసి, చాలా కుక్కలు మొరుగుతాయ్.. అందులో, ఆర్జీవీ కూడా ఒకటి.. ఇప్పటికైనా ఆర్జీవీ తప్పు తెలుసుకున్నాడు’ అంటూ, కొందరు మెగాభిమానులు అంటున్నారు.
‘శతృవునైనా చిరంజీవి ఇట్టే క్షమించేస్తారు..’ అనేది మరికొందరి వాదన. అందులో నిజం లేకపోలేదు కూడా.!
నిజంగానే, ఆర్జీవీ ‘బుద్ధి’ మారితే, ఆహ్వానించదగ్గ విషయమే.! లేదూ, మళ్లీ సోషల్ మీడియా వేదికగా వర్మ పైత్యం కొనసాగితే.. ఇక అంతే.!
