Balakrishna Akhanda2 Suresh Babu.. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, ఈ మధ్య నేరుగా సినిమాలు తీయడం తగ్గించేశారు. ఆ మాటకొస్తే, దాదాపుగా మానేశారు.!
చిన్నా చితకా సినిమాల్ని తీసుకుని, సురేష్ బ్యానర్ ద్వారా ప్రమోట్ చేయడం, విడుదల చేయడం.. ఇలా జరుగుతోంది ఇటీవలి కాలంలో.!
సురేష్ సంస్థకి కొన్ని సినిమా థియేటర్లు కూడా వున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలతో తరచూ, సురేష్ బాబు పేరు వార్తల్లోకెక్కుతున్న సంగతి తెలిసిందే.
ఓ సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌లో నిర్మాత సురేష్ బాబు, ‘అఖండ-2’ సినిమా విడుదల వాయిదా వ్యవహారంపై మాట్లాడాల్సి వచ్చింది.
Balakrishna Akhanda2 Suresh Babu.. ప్రేక్షకులంటే, సామాన్యులే కదా సురేష్.?
ఈ క్రమంలో సురేష్ బాబు, తన మాట మీద అదుపు కోల్పోయారు. ‘ప్రేక్షకులకి సినిమా బిజినెస్ లెక్కలతో ఏం పని.?’ అంటూ ప్రశ్నించేశారాయన.
నిజమే, సినిమా బిజినెస్ లెక్కలతో ప్రేక్షకుడికి పనేమీ లేదు.! కానీ, ఓ సామాన్యుడికి సినిమా గురించి తెలుసుకోవాలనే ఆసక్తి వుంటుంది కదా.!
సినీ ప్రేక్షకుడూ సామాన్యుడే కదా.! ఆ సామాన్యుడికి తెలియాలనే కదా, ఫలానా సినిమా ఫలానా మొత్తంలో వసూళ్ళు సాధించిందంటూ నిర్మాతలు ప్రకటించుకునేది.?
అలాంటప్పుడు, సినిమా బిజినెస్ లెక్కల గురించి సగటు సినీ ప్రేక్షకుడు ఎందుకు మాట్లాడుకోకుండా వుంటాడు.? ‘అఖండ-2’ సినిమా విడుదల వాయిదా వ్యవహారంపై పెద్ద రచ్చ జరుగుతోంది.
ఈ సినిమా గురించిన ప్రస్తావన వస్తే, ‘నో కామెంట్’ అనేసి ఊరుకుంటే, హుందాగా వుండేది సురేష్ బాబుకి.! పోనీ, తన అభిప్రాయాన్ని ఆయన చెప్పినా తప్పు లేదు.
కానీ, ప్రేక్షకులకి ఏం సంబంధం బిజినెస్ లెక్కలు.? అంటే, అదెలా కుదురుతుంది.?
