Seerat Kapoor Glamor Doll.. ‘బుజ్జీమా.. బుజ్జీమా..’ అంటూ శర్వానంద్ నటించిన హిట్ మూవీ ‘రన్ రాజా రన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది అందాల భామ సీరత్ కపూర్.
వస్తూ వస్తూనే సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసేసుకుందీ ముంబై ముద్దుగుమ్మ. కానీ, ఏం లాభం.! ఆ తర్వాత చేసిన సినిమాలేమీ సీరత్ కపూర్‌కి పెద్దగా కలిసొచ్చినవి కావు.
‘రాజుగారి గది’ సినిమాలో స్టార్ హీరో నాగార్జున సరసన కూడా నటించింది సీరత్ కపూర్. అలాగే మాస్ రాజా రవితేజతో ‘టచ్ చేసి చూడు’ సినిమాలోనూ సీరత్ నటించింది.
Seerat Kapoor Glamor Doll.. హాట్‌నెస్ హండ్రడ్ పర్సంట్..
హాట్‌నెస్‌కి కేరాఫ్ అడ్రస్ సీరత్ కపూర్. అలా అని కేవలం గ్లామర్ డాళ్ మాత్రమే అని తీసి పడేయడానికి లేదు సీరత్‌ని. చాలా చాలా టాలెంటెడ్.
బేసిగ్గా డాన్స్ కొరియోగ్రఫర్ కాబట్టి.. పాటల్లో హాట్‌నెస్‌తో పాటూ డాన్సింగ్ స్టెప్పులు కూడా ఇరగదీసేస్తుంటుంది సీరత్ కపూర్.

తొలి సినిమాలో క్యూటుగా కనిపిస్తూనే తనదైన డాన్సులతో ఆకట్టుకుంది. ఈ డాన్సింగ్ టాలెంట్‌తోనే కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లోనూ మెరిసింది.
ఇక, హాట్‌నెస్ విషయానికి వస్తే.. అన్‌లిమిటెడ్ గ్లామర్‌తో రెచ్చిపోతుంటుంది. ఉంగరాల జుట్టు సీరత్ హాట్ అప్పీల్‌ని మరింత హైలైట్ చేస్తుంటుంది.

తాజాగా గోల్డెన్ కలర్ అవుట్ ఫిట్‌లో సీరత్ అందాలకు నెటిజనం ఫిదా అవుతోంది. బ్రైట్ అండ్ హాట్ లుక్స్‌తో క్రేజీ ట్రాన్స్‌లోకి తీసుకెళ్లిపోతోంది సీరత్ కపూర్.
బ్యాక్ గ్రౌండ్ డార్క్‌నెస్.. హనీ షేడ్ గోల్డెన్ డ్రస్.. అండ్ కిల్లింగ్ లుక్స్‌తో సీరత్ చేస్తున్న గ్లామరస్ హంగామా అంతా ఇంతా కాదు.
Also Read: మీ టూత్ పేస్టులో ‘క్యాన్సర్’ వుందా.?
ఇంతలా హొయలొలికించేస్తోంటే.. సీరత్ కపూర్ గ్లామర్‌కి కుర్రకారు గింగిరాలు తిరగకుండా వుంటారా.? అందుకే, సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్ అయిపోతున్నాయ్ మరి.!
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే, ఫ్యాషన్ ట్రెండ్స్ ఫాలో అవడంలో సీరత్ కపూర్ తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
