Jagan Rushikunda Palace Disaster.. విశాఖ వెళితే, బీచ్ చూడకుండా రాగలమా.? ఛాన్సే లేదు.!
బీచ్ రోడ్డులో అలా అలా వెళుతోంటే, అక్కడ రుషికొండ ప్యాలెస్ కనిపించడం సహజమే. ఆ ప్యాలెస్ చూశాక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిట్టుకోవడమూ మామూలే.!
పర్యాటక భవనం.. అని పైకి చెబుతూనే, వైఎస్ జగన్ అక్కడే నివాసం వుంటారని.. వైసీపీ హయాంలో పలువురు మంత్రులు సెలవిచ్చారు.
2024 ఎన్నికల్లో గెలిచి విశాఖలోనే కాపురం పెడతానని కూడా వైఎస్ జగన్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. వైఎస్ జగన్ నివాసం కోసమే, వందల కోట్లు ఖర్చు చేసి, లగ్జరియస్‌గా నిర్మించారు ఈ ప్యాలెస్సుని.
Jagan Rushikunda Palace Disaster.. వందల కోట్ల ప్రజాధనం వృధా..
దూరం నుంచి చూడ్డానికి బానే వున్నా, ‘వైఎస్ జగన్ నివాసం కోసం.. వందల కోట్ల ప్రజా ధనం’ అన్న వాస్తవాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ, ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడి, సొంత ప్యాలెస్సుని ప్రజాధనంతో నిర్మించుకోలేదన్న చర్చ, రుషికొండ ప్యాలెస్‌ని చూసినవారలో జరుగుతోంది.
అబ్బే, అది జగన్ నివాసం కోసం కట్టించుకున్న సొంత భవనం కాదు.. అంటూ, వైసీపీ నేతలు ఇప్పుడెంత బుకాయిస్తున్నా.. అది వృధా ప్రయాసే.
కొండని ఎంత దారుణంగా తొలిచేసి, రుషికొండ ప్యాలెస్సుని వైసీపీ హయాంలో నిర్మించారో, అదిప్పుడు అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read: ప్రియాంక చోప్రా.. డబుల్ ధమాకా.!
దాంతో, అటువైపు వెళ్ళినవారంతా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిట్టుకోకుండా వుండలేకపోతున్నారు.! ఇప్పుడా భవనం ఎందుకూ పనికిరాకుండా పోవడంతో, జనంలో మరింత అసహనం పెరిగిపోతోంది.
రుషికొండ ప్యాలెస్ ఎన్నాళ్ళు వినియోగం లేకుండా వుంటే, అంతలా వైసీపీ మీద నెగెటివిటీ వస్తుందన్నది నిర్వివాదాంశం. వినియోగంలోకి వచ్చినా, వైసీపీ మీద నెగెటివిటీ తగ్గదు.
ఒక్కమాటలో చెప్పాలంటే, రిషికొండ ప్యాలెస్ అంటే, అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ అలాగే.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కూడా రాజకీయ సమాధి.. అనడం అతిశయోక్తి కాదేమో.! జనంలో అదే చర్చ జరుగుతోంది మరి.!
