పోలీసుల బట్టలూడదీసి నిలబెట్టే పంచాయితీ ఏంటి జగన్.?
Ys Jagan Police.. ఏదన్నా నేరం చేసి, జైలుకు వెళితే.. నేరాభియోగాలు మోపబడి జైలుకు వెళితే.. జైల్లో, ఖైదీ బట్టలూడదీసి.. ‘సకల పరీక్షలూ’ చేస్తారని కొన్ని సినిమాల్లో ఈ మధ్య చూశాం.
జైల్లో బట్టలూడదీసి ఖైదీల్ని పోలీసులు కొట్టడం కూడా చాలా సినిమాల్లో చూస్తూనే వున్నాం.! అదే పోలీసుల బట్టలూడదీసి నిల్చోబెడతానని ఎవరైనా అంటే ఎలా వుంటుంది.? అసహ్యంగా వుంటుంది.!
ఐదేళ్ళ పాటు ముఖ్య మంత్రిగా పని చేసి, ప్రస్తుతం ఓ ఎమ్మెల్యేగా బాధ్యతాయుతమైన పదవిలో వుండి, మళ్ళీ ముఖ్య మంత్రి అవుతాననే నమ్మకంతో వున్న వ్యక్తి.. మాట్లాడాల్సిన మాటలేనా ఇవి.?
సభ్య సమాజానికి ఏం సంకేతాలు ఇస్తున్నట్లు సదరు మాజీ ముఖ్యమంత్రి.? ఆయనెవరో కాదు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తాజాగా పోలీసులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.
Ys Jagan Police.. ఎందుకు వెళ్ళావ్.? ఏం మాట్లాడావ్.?
వైసీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌ని ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ఆయన్ని జైల్లో పరామర్శించేందుకు నిన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెళ్ళారు.
ఊరికే పరామర్శించేసి వస్తే ఎలా.? బోల్డంత జన సమీకరణ చేశారు. ఆ జనాన్ని చూసుకుని ఒంటి మీద సోయ లేకుండా, ఏదేదో వాగేశారు.
‘వాగుడు’ అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, ఇదిగో ఈ ‘బట్టలూడదీసి నిల్చోబెడతాం’ అని అనడాన్ని ఇంకేమనాలి.?
ఆ పోలీస్ అధికారులే గత వైసీపీ హయాంలో కూడా పని చేశారు. అప్పట్లో వైసీపీ, పోలీసు వ్యవస్థని ఎలా వాడిందో ప్రపంచమంతా చూసింది కదా.!
అర్థ రాత్రి ఇళ్ళల్లోకి దూకి అరెస్టులు చేయడం.. అదీ, సోషల్ మీడియాలో పోస్టింగులు చేశారన్న నెపంతో.! థర్డ్ డిగ్రీ ప్రయోగం.. అదీ, వైసీపీ నుంచే ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు మీద.!
తమ హయాంలో ఇంతలా పోలీసు వ్యవస్థని దుర్వినియోగం చేసి, ఇప్పుడు అదే పోలీసు వ్యవస్థ మీద ‘బట్టలూడదీసి నిలబెడతా’ అని వైసీపీ అధినేత అంటున్నారంటే, ఎంత కండకావరం.?
పోలీసులు నిజంగానే అలా చేస్తే.?
నిజానికి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. మరి, జగన్ అరెస్టయితే.. పైన ప్రస్తావించినట్లుగా సినిమాటిక్ ‘బట్టలిప్పి నిల్చోబెట్టే’ కార్యక్రమాలుంటాయా.?
గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘అక్రమాస్తుల కేసులో’ అరెస్టయిన సంగతి తెలిసిందే. దాదాపు 16 నెలలు ఆయన ఆ కేసులో జైల్లో వున్నారన్న విషయం గుర్తుండే వుంటుంది.
అన్నట్టు, చంద్రబాబు కంటే గ్లామరస్‌గా, అందంగా వుంటారు కాబట్టే, వల్లభనేని వంశీని అరెస్టు చేయించారంటూ చిత్ర విచిత్రమైన కామెంట్లు పాస్ చేశారు వైఎస్ జగన్.
ఇంతకీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగానే వుందా.? ఈ ప్రశ్న నెటిజన్ల నుంచి పోటెత్తుతోంది.
అయినా, రాజకీయాల్లో ‘అందం’ తాలూకు ప్రస్తావన, ‘గ్లామరస్’ ప్రస్తావన ఏంటి.? పైగా, ‘బట్టలూడదీసి నిలబెడతాం’ అనే ఫాంటసీ ఎందుకో.?