Thamma Telugu Review.. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మండన్న జంటగా తెరకెక్కిన సినిమా ‘థామా’.! హిందీతోపాటు, తెలుగులోనూ విడుదలైంది.!
మిక్స్‌డ్ టాక్‌తో కూడా ఓ మోస్తరు వసూళ్ళను ‘థామా’ సినిమా రాబట్టిందనే ప్రచారం జరుగుతోంది. తెలుగులో అయితే, ‘థామా’ సందడి పెద్దగా లేదు.!
ఇంతకీ, ‘థామా’ కథా కమామిషు ఏంటి.? భయస్తుడైన ఓ యువకుడు, స్నేహితులతో కలిసి అడ్వెంచరస్ జర్నీ చేస్తాడు. ఓ అడవిలో తప్పిపోతాడు.!
ఓ పెద్ద ఎలుగుబంటి అతన్ని చంపేయబోతే, ఓ యువతి అతన్ని కాపాడుతుంది. అయితే, ఆ యువతి గురించి షాకింగ్ విషయం తెలుస్తుంది హీరోగారికి.!
Thamma Telugu Review.. రక్తం తాగుతారు.. వింతేముంది.?
చాలా కాలంగా, ఈ తరహా సినిమాల్ని చూస్తూనే వున్నాం. అత్యంత భయంకరంగా వుండేవి.. భయంతో కూడిన కామెడీ సినిమాలూ.. బోల్డన్ని వెబ్ సిరీస్‌లు.. వాట్ నాట్. కథ పెద్దదే.!
బేతాళులంట.. రక్తం తాగి మనుగడ సాధిస్తుంటారట. వీరికి గుండె కొట్టుకోవడం అనేది వుండదట. కానీ, ఒక్కరికి మాత్రమే గుండు కొట్టుకుంటుందట. అతనే ‘థామా’ అట. ‘థామా’ అంటే నాయకుడని అర్థం ఇక్కడ.
హీరోని కాపాడే ప్రయత్నం, అప్పటిదాకా అడవినే ఆశ్రయంగా చేసుకుని వున్న ఆ యువతి, నగరంలోకి వచ్చేస్తుంటుంది. నగరంలో చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేస్తుంటుంది.
ఓ దశలో, హీరో కూడా మారిపోతాడు. అలా మారిపోవడంతో అతనికి ఓ కొత్త సమస్య వస్తుంది. ఆ సమస్య నుంచి అతన్ని బయటపడేయడానికి, ఆమె తిరిగి అడవికి వెళ్ళిపోతుంది.
ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది కదా.. దాపరికం ఏమీ లేదిక్కడ.! అంతా ఓపెన్.! నిజానికి, మొదటి సారి చూసినా అంత సస్పెన్స్ ఏమీ అనిపించదు.
తర్వాత ఏం జరుగుతుందో ముందే తెలిసిపోతుంది.! దర్శకుడు తనకిష్టమొచ్చినట్లు కథ రాసుకుంటూ పోయాడు.! హీరో, కామెడీ చేయబోయి.. అదేదో చేసేశాడు.
హీరోయిన్ రష్మిక అయితే, గ్లామర్ ప్రదర్శన మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లుంది. అసలు అంత స్కిన్ షో ఎందుకో ఏమో.! స్కిన్ షో వుంటే చాలు, థియేటర్లకు జనాల్ని రప్పించేయొచ్చని మేకర్స్ అనుకున్నారేమో.
మనిషి గెటప్ కంటే, రక్తాన్ని తాగే బేతాళ గెటప్పు బాగా సూటయ్యింది రష్మిక మండన్నకి.! చాలా నేచురల్‌గా వుందామెకి.. అంటే, నేషనల్ క్రష్ ఫ్యాన్స్ ఫీలవుతారేమో.!
చాన్నాళ్ళ క్రితం ‘టూత్ పరి’ అని ఓ వెబ్ సిరీస్ వచ్చింది. ఆ కథ, ఈ ‘థామా’ కథ.. దాదాపు ఒకటే.! మొన్నీమధ్యనే వచ్చిన ‘లోకా’ కాన్సెప్ట్ కూడా ఇదే కదా.!
సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. ఇవన్నీ సాధారణంగా వున్నాయంతే.! కథ చాలా సిల్లీగా రాసుకున్నారు. కథనం ఇంకా సిల్లీగా వుంది. సో, నటీనటులూ సిల్లీగానే నటించుకుంటూ వెళ్ళిపోయారు.
హీరో హీరోయిన్ల మధ్య రొమాంటిక్ ట్రాక్ ఇంకాస్త ఇంట్రెస్టింగ్‌గా వుండి వుంటే బావుండేది. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ పెద్దగా వర్కవుట్ కాలేదు. మూతి ముద్దుల కక్కుర్తి వెగటు పుట్టించింది.
పరేష్ రావల్ లాంటి గొప్ప నటుడ్ని కూడా సరిగ్గా వాడుకోలేకపోయారంటే.. ఎంత లైట్‌గా సినిమాని మేకర్స్ తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు.!
ఫైనల్ టచ్.. ‘ప్రేక్షకుల రక్తాన్ని తాగారు.. అంతేగా, ఇంకేముంది కొత్తగా..’ అనే కామెంట్, సినిమా చూసినవాళ్లకి అనిపిస్తే, అది వాళ్ళ తప్పు కానే కాదు.!
