Delhi Air Pollution.. ఢిల్లీ అంటే, దేశ రాజధాని కదా.! మరి, దేశ రాజధానిలో కాలుష్యం ప్రమాద ఘంటికల్ని మోగిస్తున్నా, ఎవరూ పట్టించుకోరేం.?
కాలం చెల్లిన వాహనాల్ని నిషేధిస్తే సరిపోతుందా.? వాహనదారులు తమ వాహనాల్ని వారంలో రోజు విడిచి రోజు మాత్రమే బయటకు తీయాలనే నిబంధనలు తెరపైకి తెస్తే కాలుష్యం తగ్గుతుందా.?
చిన్న పిల్లలు, వృద్ధులు మాత్రమే కాదు.. కాలుష్యం అందరికీ ప్రమాదకరమే. కాకపోతే, చిన్న పిల్లలకీ అలాగే వృద్ధులకీ అది అత్యంత హానికరం.!
అరవింద్ కేజ్రీవాల్, శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతుంటారు. కానీ, ఆయన ముఖ్యమంత్రిగా వున్న సమయంలోనూ, ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు సరైన చర్యలు చేపట్టలేకపోయారు.
Delhi Air Pollution.. వాహన కాలుష్యం మాత్రమే కాదు..
దేశ రాజధాని కదా.. నిత్యం వాహనాల రద్దీ వుంటుంది ఢిల్లీలో. దానికి తోడు, ఢిల్లీ సరిహద్దుల్లో పొరుగు రాష్ట్రాలకు చెందిన రైతులు, పంట కాలం ముగిశాక, పంట పొలాల్లో మంటలు వేస్తుంటారు.
ఓ వైపు వాహనాల కాలుష్యం.. ఇంకో వైపు పంట పొలాల నుంచి వచ్చే పొగ.. వెరసి, ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంటూనే వుంది.
ప్రమాదకర స్థాయిని దాటేసి, అత్యంత ప్రమాదకరమైన స్థాయిని కూడా దాటేసినా.. ఢిల్లీ ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం.. సరైన చర్యలు చేపట్టలేకపోతోంది.
వాయు కాలుష్యం అంటేనే అంత.! ఓ దశ దాటాక చెయ్యడానికేమీ వుండదిక.! దేశంలోని చాలా రాష్ట్రాల్లోని ప్రముఖ నగరాలు వాయు కాలుష్యం బారిన పడుతున్నాయి.
ఢిల్లీ స్థాయిలో వాయు కాలుష్యం పెరిగిపోయిన నగరాలు దేశంలో చాలానే వున్నాయ్. కాకపోతే, దేశ రాజధాని కదా.. ఢిల్లీ వాయు కాలుష్యం గురించిన చర్చే ఎక్కువ జరుగుతుంటుంది.
నిత్యం మొహానికి మాస్క్ వుంటే తప్ప, ఢిల్లీలో బతకలేని పరిస్థితి దాపురించిందని, ఢిల్లీ వాసులు చెబుతుంటారు. ఇదీ అక్కడి దుస్థితి.
ఇదే నిర్లక్ష్యం ముందు ముందు కూడా కొనసాగితే, కొన్నేళ్ళ తర్వాత, దేశ రాజధాని ఢిల్లీ.. మనుషులకు నివాస యోగ్యం కాని ప్రాంతంగా మారిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని వుండదు.
Also Read: రాత్రికి రాత్రే 240 కోట్లు కొల్లగొట్టేశాడు.!
వాయు కాలుష్యం.. మానవ తప్పిదమే.! సరిదిద్దుకోవడానికి అవకాశం వుంది. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్ అంతే.!
చట్టాలు చేసే ప్రధాని, కేంద్ర మంత్రులు దేశ రాజధాని ఢిల్లీలోనే కదా వుంటారు.! రాష్ట్ర పతి కూడా ఢిల్లీలోనే కదా వుండేది.? వాళ్ళంతా కూడా వాయు కాలుష్య బాధితులే కదా.?
అమాయక ప్రజలు మాత్రమే కాలుష్య బాధితులనుకుంటే పొరపాటు. వేల కోట్ల ఆస్తులన్నాసరే.. కాలుష్యం బారిన పడాల్సిందే.! ప్రాణాలు కోల్పోవాల్సిందే.
కాలుష్యమనే భూతాన్ని తరిమికొట్టడానికి, అందరూ కలిసి కట్టుగా పని చేయాల్సి వుంటుంది.
