పెళ్ళిళ్ళు.. రాజకీయ పొత్తులు.! పాత్రికేయ వ్యభిచారులు.!
Tegulu Media Great Vyabhicharam.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి మూడు పెళ్ళిళ్ళు జరిగాయ్.!
ఓ వివాహం కుదరక, ఇంకోటి.. ఆపై మళ్ళీ ఆ వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగక మరొకటి.. ఇలా మూడు పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ చేసుకున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే.
ఒక్క భార్యనే కట్టుకుని, తెరవెనుకాల ముప్ఫయ్ మందితో ‘రాసలీలలు’ నడిపితే నేరంగానీ, చట్టబద్ధంగా వివాహం చేసుకుని, అంతే చట్ట బద్ధంగా విడాకులు తీసుకుని, మళ్ళీ పెళ్ళి చేసుకుంటే తప్పెలా అవుతుంది.?
తెల్లారి మూడు గంటలకు నడిపే రాచకార్యాలు సహా.. ఎన్నో చూస్తున్నాం రాజకీయాల్లో.! జనసేన పార్టీని స్థాపించక ముందు నుంచీ పవన్ కళ్యాణ్, సమాజం పట్ల అవగాహనతో, బాధ్యతతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
వందల కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు కొట్టేసి జైలుకు వెళ్ళిన బాపతు కాదు పవన్ కళ్యాణ్.!
Tegulu Media Great Vyabhicharam.. వైవాహిక జీవితానికీ.. రాజకీయానికీ లింకేంటి.?
వైవాహిక జీవితంలో మనస్పర్థలు సర్వసాధారణం. కొన్ని మనస్పర్ధలు విడాకులకు దారి తీస్తాయ్. పవన్ కళ్యాణ్ జీవితంలో కూడా అదే జరిగి వుంటుంది.! అది ఆయన వ్యక్తిగత జీవితం.
రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌ని విమర్శించడానికేమీ లేదు. అందుకే, దత్త పుత్రుడనీ, ప్యాకేజీ స్టార్ అనీ.. పనికిమాలిన విమర్శల్ని చేస్తుంటారు కొందరు.
ఉన్నత పదవుల్లో వున్నవారు సైతం, ఉచ్ఛ నీఛాలు మరిచి ఏవేవో కూస్తుంటారు. అది వారి మానసిక స్థితిని తెలియజేస్తోంది. మానసికంగా వారి దిగజారుడుతనానికి అదో నిదర్శనం అంతే.
ఇక, మీడియా విషయానికొస్తే, కొన్ని రాజకీయ పార్టీలకు ఉంపుడు గత్తెల్లా వ్యవహరిస్తున్న మీడియా సంస్థలతోనే అసలు సమస్య.
ముమ్మాటికీ పాత్రికేయ వ్యభిచారమే.!
పాత్రికేయ వ్యభిచారం.. అని ఊరకనే అన్లేదు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళకీ, రాజకీయంగా పవన్ కళ్యాణ్ పెట్టుకునే పొత్తులకీ లింకులు పెట్టి మీడియా విశ్లేషించడమంటే, అంతకన్నా దిగజారుడుతనం ఇంకేముంటుంది.?
అర్థరాత్రి హైవేల మీద లారీలను ఆపే అత్యంత చీప్ బ్రోతల్స్ కంటే దిగజారిపోయి మరీ, కొందరు ‘మీడియా ముసుగులో’ ఇలాంటి రాతల్ని రాస్తుంటారు.
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి, ప్రజాధనాన్ని ఏమైనా దోచుకున్నారా.? అలాంటివేమన్నా వుంటే కదా, పవన్ కళ్యాణ్‌ని తప్పు పట్టాలి.?
Also Read: బొమ్మతో బాక్సింగు.! గొడ్డలితో గుండె పోటు.!
పొత్తులనేవి రాజకీయ ప్రక్రియలో ఓ భాగం. పెళ్ళి అనేది వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయం. మీడియా ముసుగేసుకున్న ది గ్రేట్ బ్రోతల్స్‌కి అలాంటివి అర్థం కావు.!
నిజానికి, పూట గడవక వ్యభిచారాన్ని ఆశ్రయించేవారిని ఈ తరహా మీడియా బ్రోతల్స్‌తో పోల్చడం సబబు కాదు.! ఆ స్థాయికి పాత్రికేయ వ్యభిచారం దిగజారిపోయిందెప్పుడో.!