Table of Contents
Jagan Jail Two Months.. రెండంటే రెండు నెలల్లోనే జైలుకి.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో సంచలనమిది.! న్యాయస్థానాలు ఒప్పుకుంటాయా.?
ప్రభుత్వం అంత యాక్టివ్‌గా వ్యవహరించగలుగుతుందా.? పోలీస్ వ్యవస్థ ఎంత బాధ్యతాయుతంగా పని చేస్తుంది.? మరి, న్యాయస్థానాల పరిస్థితేంటి.?
బెదిరింపా.? లేదంటే, ఇంకేదన్నా బలమైన కారణం వుందా.? అసలేంటి, ‘రెండు నెలల్లోనే జైలుకి’ అన్న స్టేట్మెంటుకి అర్థం.?
న్యాయ నిపుణులు ఏమంటున్నారు.? వ్యవస్థలు ఏమైపోవాలి.? వ్యవస్థల మీద ప్రజలకున్న నమ్మకం సడలిపోతుందా.?
Jagan Jail Two Months.. బెదిరింపే.. ఇది వైఎస్ జగన్ మార్క్ రాజకీయం.!
చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలోని కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేస్తున్నారన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ ఆరోపణ.!
ఈ మేరకు, కోటి సంతకాల సేకరణ పేరుతో పెద్ద హంగామా చేస్తోంది గత కొద్ది రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
గవర్నర్‌కి ఆ కోటి సంతకాలకు సంబంధించిన విజ్ఞాపన పత్రం అందించే ముందు జగన్, పార్టీ ముఖ్య నేతల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.
ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు లేదా ప్రైవేటు సంస్థలు.. ఈ మెడికల్ కాలేజీల్ని తీసుకుంటాయో, వారు జైలుకు వెళ్ళాల్సి వస్తుందన్నది వైఎస్ జగన్ హెచ్చరిక.
వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండంటే రెండు నెలల్లోనే, వాళ్ళందర్నీ జైళ్ళకు పంపుతామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించేశారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయం..
ప్రైవేటు మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణకు సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ అనే మోడల్‌ని కేంద్రం ప్రతిపాదించింది. సంబంధిత కమిటీలో వైసీపీకి చెందిన ఎంపీ కూడా సభ్యుడిగా వున్నారు.
ఆ ప్రతిపాదనకు అనుగుణంగానే, ఆంధ్ర ప్రదేశ్‌లో నిర్మాణంలో వున్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్‌కీ, ప్రైవేటీకరణకీ తేడా తెలియనంత అమాయకుడైతే కాదు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. వైఎస్ జగన్‌కి సొంతంగా మీడియా సంస్థలు, పవర్ కంపెనీలు, సిమెంట్ ఫ్యాక్టరీలు వున్నాయ్.
స్వతహాగా వ్యాపారవేత్త అయిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘పీపీపీ’ మోడల్ అంటే ఏంటో తెలియదని ఎలా అనుకోగలం.?
బెదిరిస్తే భయపడతారా.?
అయినా, ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్నాక, ఆ నిర్ణయానికి అనుగుణంగా ప్రైవేటు వ్యక్తులు, ప్రభుత్వంతో కలిసి పని చేస్తే, వారిని జైల్లో పెడతామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హెచ్చరించడమేంటి.?
ఆ లెక్కన, వైసీపీ హయాంలో జరిగిన నిర్ణయాలపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి.?
వైఎస్ జగన్ హయాంలో చంద్రబాబు అరెస్ట్ జరిగింది స్కిల్ డెవలప్మెంట్ స్కామ్.. పేరుతో. కానీ, చంద్రబాబు హయాంలో వైఎస్ జగన్ అరెస్టు జరగలేదు.. జగన్ మీద చాలా ఆరోపణలున్నా.
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికో, నిజంగానే బెదిరింపులకు దిగడానికో.. ‘రెండు నెలల్లోనే జైలు’ అంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయం.!
