Kiara Advani Toxic.. సక్సెస్, ఫెయిల్యూర్.. వీటితో సంబంధం లేకుండా, ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు దక్కించుకుంటోంది అందాల భామ కియారా అద్వానీ.!
మొన్నామధ్య ‘గేమ్ ఛేంజర్’ అంటూ సందడి చేసింది. ఆ తర్వాత ‘వార్-2’ సినిమాతోనూ ప్రేక్షకుల్ని పలకరించింది. 2025లో విడుదలైన ఈ రెండు సినిమాలూ బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడ్డాయ్.
‘వార్-2’, ‘గేమ్ ఛేంజర్’.. ఈ రెండూ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులే. ఈ రెండూ ఫెయిల్ అవడంలో, కియారా అద్వానీ చేసిన పాపమేమీ లేదు.
అయినాగానీ, కియారా అద్వానీ మీద ‘ఐరన్ లెగ్’ ఇమేజ్ పడిపోయింది. అన్నట్టు, కియారా అద్వానీ నటించిన ‘వినయ విధేయ రామ’ కూడా డిజాస్టరే.!
తెలుగులో కియారా అద్వానీ నటించిన ‘భరత్ అనే నేను’ సినిమా ఒక్కటే, ఆమె ఖాతాలో పెద్ద హిట్.!
ఇక, ఇప్పుడు ‘టాక్సిక్’ అంటూ, ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతోంది కియారా అద్వానీ. ‘కేజీఎఫ్’ ఫేం యష్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది.
యష్ ఈ చిత్రానికి రచనా సహకారం కూడా అందించడం గమనార్హం. గీతూ మోహన్ దాస్ ఈ ‘టాక్సిక్’ సినిమాకి దర్శకుడు.
పాన్ ఇండియా స్థాయిలో, అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ ‘టాక్సిక్’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ‘టాక్సిక్’ నుంచి తాజాగా, కియారా అద్వానీ లుక్‌ని విడుదల చేశారు.
‘టాక్సిక్’ సినిమాలో కియారా అద్వానీ పోషిస్తున్న పాత్ర పేరు ‘నదియా’.! అల్ట్రా స్టైలిష్‌గా వుంది కియారా అద్వానీ లుక్.
పోస్టర్ ఇలా విడుదలయ్యిందో అదో, అలా వైరల్ అయ్యింది. ఇంతకీ, ఈ సినిమాతో అయినా కియారా అద్వానీ బౌన్స్ బ్యాక్ అవుతుందా.? అవ్వాలనే ఆశిద్దాం.
