Table of Contents
Ramcharan Trivikram Combination.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా చేయనున్నాడన్న ప్రచారం ఈనాటిది కాదు.
చాలాకాలంగా, ఈ కాంబినేషన్‌కి సంబంధించి ఊహాగానాలు వినిపిస్తూనే వున్నాయి. ఫలానా బ్యానర్‌లో.. అంటూ బోల్డన్ని గాసిప్స్ హల్‌చల్ చేశాయి.
ఎట్టకేలకు, రామ్ చరణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌కి సంబంధించి దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసినట్లే. త్వరలో, ఈ కాంబినేషన్ పట్టాలెక్కబోతోంది.
Ramcharan Trivikram Combination.. నిర్మాణ బాధ్యత ఎవరిది.?
త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా అంటే, ఏ బ్యానర్ వద్దనుకుంటుంది.? ఏ నిర్మాత కాదంటారు.? అలానే, రామ్ చరణ్ విషయంలో కూడా.!

అయితే, చాలాకాలంగా హారిక హాసిని – సితార సంయుక్తంగా, ఈ కాంబినేషన్ కోసం ప్రయత్నిస్తోంది. పేరుకే వేర్వేరు బ్యానర్లు.. రెండూ ఒకరివే కదా.!
అయినాగానీ, సితార బ్యానర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దాంతోపాటుగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ సొంత బ్యానర్ కూడా చేతులు కలుపుతోందిట.
పవన్ కళ్యాణ్ పేరెందుకు వినిపిస్తోంది.?
ఇంకా ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతుండడం.
‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా టైమ్‌లోనే, బాబాయ్ పవన్ కళ్యాణ్ బ్యానర్‌లో సినిమా చేయాలని అబ్బాయ్ రామ్ చరణ్ అనుకున్నాడనుకోండి.. అది వేరే సంగతి.
ప్రస్తుతానికైతే ‘పెద్ది’ సినిమా పనుల్లో బిజీగా వున్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కాలి.
రెండు సినిమాలూ ఒకేసారి.?
సుకుమార్ – త్రివిక్రమ్.. ఇలా ఒకేసారి ఇద్దరు దర్శకులతో రామ్ చరణ్ సినిమా చేసే అవకాశముందా.? డేట్స్ ఏమైనా క్లాష్ అవుతాయా.? ఇదీ ఆలోచించాల్సిన విషయమే.
Also Read: 21 Vs 11: 100% స్ట్రైక్ రేట్‌తో వైసీపీని పాతాళానికి తొక్కిన పవన్!
వేగం పెంచాలనే ఆలోచనతో వున్న రామ్ చరణ్, సైమల్టేనియస్‌గా రెండు సినిమాలూ చేయనున్నాడన్న ప్రచారమైతే గట్టిగా జరుగుతోంది.
కొద్ది రోజుల్లోనే అన్ని విషయాల మీదా క్లారిటీ రాబోతోంది.! అప్పటిదాకా ఈ సస్పెన్స్ తప్పదు.