Peddi Appalasuri Jagapathibabu.. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా విడుదలకు ముందే, సంచనాలకు కేంద్ర బిందువు అవుతోంది.
‘పెద్ది’ నుంచి వస్తోన్న ఒక్కో అప్డేట్.. ‘అంతకు మించి’ అనే స్థాయిలో డిజైన్ చేసి మరీ, వదలుతున్నట్లుంది. తాజాగా, ‘పెద్ది’ టీమ్ నుంచి ‘అప్పలసూరి’ అనే పాత్ర పరిచయమయ్యింది.
సీనియర్ నటుడు జగపతిబాబు ‘అప్పలసూరి’ పాత్రలో కనిపించనున్నారు. ఈ ‘అప్పలసూరి’ పాత్రలో జగపతిబాబు గెటప్, ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా డిజైన్ చేశారు.
Peddi Appalasuri Jagapathibabu.. గెటప్పుకే అవార్డులు..
‘అప్పలసూరి’ గెటప్పుకే అవార్డులు ఇచ్చేయొచ్చంటూ, సగటు సినీ అభిమాని అభిప్రాయపడుతున్నాడు. చాలామంది, ఈ గెటప్పులో అసలు జగపతిబాబుని గుర్తుపట్టలేకపోతున్నారు.
కొన్ని గెటప్పులు, అవసరానికి మించి డిజైన్ చేయబడతాయి. కానీ, ‘అప్పలసూరి’ గెటప్ మాత్రం, సినిమాకి తగ్గట్టుగా డిజైన్ చేయబడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పొరపాటున, వేరే నటుడి ఫొటోని జగపతిబాబు పేరుతో విడుదల చేశారేమోనని తొలుత చాలామంది అనుకున్నారు.
స్వయంగా జగపతిబాబు సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి ఈ డిజైన్ వచ్చే సరికి, ‘వావ్ జగ్గూబాయ్..’ అంటూ, ఆయన్ని అభినందనలతో ముంచెత్తుతున్నారు.
Also Read: రాత్రికి రాత్రే 240 కోట్లు కొల్లగొట్టేశాడు.!
రామ్ చరణ్ – జగపతిబాబు కలిసి నటించిన ‘రంగస్థలం’ సినిమాలో, జగపతిబాబు పాత్ర ఏ స్థాయిలో హైలైట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.!
ఈసారి వీరిద్దరి కాంబినేషన్‌లో ‘పెద్ది’ మరింత సంచలన విజయాన్ని అందుకోవడం ఖాయమనే చర్చ అంతటా జరుగుతోంది.
కాగా, 2025లో విడుదలైన ఆడియో సింగిల్స్‌లో ‘పెద్ది’ రికార్డుల మోత మోగించేస్తున్న సంగతి తెలిసిందే. ‘చికిరి చికిరి’ అంటూ సాగే పాట, ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోనే వుంది.
