Pawan Kalyan Movie Advance.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కొత్త సినిమాకి కమిట్ అయ్యారు. పాత కమిట్మెంటే ఇది.! కాకపోతే, కొత్త సంవత్సరంలో ఇంకోసారి అధికారిక ప్రకటన వచ్చిందంతే.
రామ్ తాళ్ళూరి నిర్మాతగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతోంది. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథను అందిస్తున్నాడు.
మెగాస్టార్ చిరంజీవితో ‘సైరా’ చిత్రాన్ని తెరకెక్కించాడు గతంలో సురేందర్ రెడ్డి. ఆ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వాయిస్ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Pawan Kalyan Movie Advance.. పవన్ కళ్యాణ్ చేయబోయే సాయమెంత.?
కొన్నాళ్ళ క్రితం, ఓ సినిమాకి సంబంధించి తీసుకున్న ఐదు కోట్ల రూపాయల అడ్వాన్స్‌ని, ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిన కౌలు రైతు కుటుంబాల కోసం సాయం చేశారు పవన్ కళ్యాణ్.
ఈ మధ్యనే ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని వెల్లడించారు. సినిమాలు చేయడం, తద్వారా పార్టీకి ఆర్థికంగా వెన్ను దన్నుగా వుండడం.. దీని గురించి పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పారు.
Also Read: నాకింకా పెళ్ళి కాలేదు.! ఆ వేధింపులు ఆపండి.!
తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం, పార్టీని నడిపించడం కోసం.. వీటి కోసమే కాదు, సంపాదించిన మొత్తంలో కొంత భాగాన్ని, సేవా కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ వినియోగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో, కొత్త సినిమా కోసం తీసుకున్న మొత్తంలోంచి ఎంత భాగాన్ని పవన్ కళ్యాణ్, సేవా కార్యక్రమాల కోసం వినియోగించనున్నారన్న చర్చ అంతటా జరుగుతోంది.
అన్నట్లు, నిర్మాత రామ్ తాళ్ళూరి.. జన సేన పార్టీలో ఓ కీలక పదవిలో వున్న సంగతి తెలిసిందే. తొలుత పవన్ కళ్యాణ్ అభిమాని తాళ్ళూరి వెంకట్. ఆ తర్వాతే, జన సేన నాయకుడు, నిర్మాత.
కాగా, పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్ళూరి నిర్మించబోయే సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుని, ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.
