Pawan Kalyan Telangana Politics.. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఇటీవల సందర్శించారు.
టీటీడీ నిధులతో, భక్తుల కోసం వసతి సముదాయాన్ని నిర్మించేందుకు పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పంపిన ప్రతిపాదనలు కార్యరూపం దాల్చాయి.
ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు, హైటెన్షన్ విద్యుత్ తీగల కారణంగా పెను ప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తూ స్వల్ప గాయంతో బయటపడ్డారు పవన్ కళ్యాణ్.
అప్పటినుంచి కొండగట్టు ఆంజనేయ స్వామి అంటే, బలమైన విశ్వాసాన్ని జనసేనాని పెంచుకున్నారు. మొత్తంగా నాలుగు సార్లు కొండగట్టుకు వెళ్ళారు జనసేనాని.
Pawan Kalyan Telangana Politics.. పార్టీ శ్రేణులతో మమేకమైన జన సేనాని
కాగా, తెలంగాణ పర్యటనలో పార్టీ శ్రేణులతో జనసేనాని మమేకమయ్యారు. బలమైన కార్యకర్తలే, బలమైన నాయకులుగా ఎదుగుతారని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
మరోపక్క, పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన విషయమై కొన్ని రాజకీయ పార్టీలు ఉలిక్కిపడుతున్నాయి. ఆయా పార్టీల నేతలు, కార్యకర్తలు అవాకులు చెవాకులు పేలడం చూస్తున్నాం.
‘కూటమి ప్రభుత్వానికి కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులు వుంటాయా.?’ అని మీడియా ప్రతినిథి ఒకరు అడిగితే, ‘రాజకీయ కోణంలో దేవుడి ఆశీస్సులు ఎవరికీ వుండవు’ అని పవన్ కళ్యాణ్ నిర్మొహమాటంగా చెప్పారు.
రాజకీయాల విషయమై ఇంత స్పష్టతతో బాధ్యతతో వున్న పవన్ కళ్యాణ్ మీద అవాకులు చెవాకులు పేలడం హాస్యాస్పదం కాక మరేమిటి.?
తెలంగాణ రాజకీయాల్లో.. వ్యూహాత్మక అడుగులు..
ఒక్కటి మాత్రం నిజం.. ఏపీ రాజకీయాల్లో ఎలాగైతే జనసేన తనదైన ముద్ర వేసిందో.. ముందు ముందు తెలంగాణ రాజకీయాల్లోనూ జనసేన పార్టీ తనదైన సత్తా చాటబోతోంది.
అదే, ఆ భయంతోనే కొందరు రాజకీయ నాయకులు, కొన్ని పార్టీల కార్యకర్తలు.. హద్దులు దాటి జన సేనాని పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు.
రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి, పార్టీ బలోపేతం దిశగా, జన సేనాని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్న దరిమిలా, ముందు ముందు మరిన్ని రాజకీయ విమర్శలు ఆయన మీద వస్తాయన్నది నిర్వివాదాంశం.
