Morusupalli Sharmila Shasthri.. ఆమె అందరికీ, ‘వైఎస్ షర్మిల’గానే సుపరిచితురాలు.! దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె ఆమె.!
దురదృష్టం.. ఇప్పుడామె మోరుసుపల్లి షర్మిల అయ్యారు.! అక్కడితో ఆగలేదు, ‘షర్మిల శాస్త్రి’ అని కూడా అంతున్నారు.!
ఎవరో ఇలా వెటకారం చేస్తే అది వేరే లెక్క. సాక్షాత్తూ వైఎస్ షర్మిల సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడుపుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ఆమె ఇంటిపేరుని మార్చేసింది.!
షర్మిలని Morusupalli Sharmila అని పేర్కొంటూ హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చింది వైసీపీ.! వైసీపీ అభిమానులూ అదే ఫాలో అవుతున్నారు.
Morusupalli Sharmila Shasthri.. మూడు రోజుల్లోనే మారిన ఇంటిపేరు.?
ఎందుకిలా.? రాజకీయం ఏమైనా చేయగలదనడానికి ఇదొక ఉదాహరణ మాత్రమే. అన్నట్టు, జస్ట్ రెండు మూడు రోజుల క్రితమే, ‘వైఎస్ షర్మిల కుమారుడి ఎంగేజ్మెంట్‌కి హాజరైన వైఎస్ జగన్’ అని ఇదే వైసీపీ అధికారిక హ్యాండిల్ పేర్కొంది.
జస్ట్ రెండు మూడు రోజుల గ్యాప్‌లో వైఎస్ షర్మిల కాస్తా మొరుసుపల్లి షర్మిలగా ఎలా వైసీపీ దృష్టిలో మారిపోయినట్లు.?
నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?
రాజకీయాల్లో విమర్శలు సహజం.! కానీ, మరీ ఇంతలానా.? ఆడపిల్లని ఏడిపించి ఎవరైనా ఏం సాధిస్తారు.? ఆడపిల్ల అంటే, ఆడ.. పిల్ల.. అని షర్మిల మార్కు సెటైర్లు ఇక్కడ తగదు.!
ఔను.! రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు.! అంతేగానీ, రాజకీయ ప్రత్యర్థి పెళ్ళిళ్ళ గురించి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయకూడదు.
తల్లీ లేదు.. చెల్లీ లేదు.. ఇదేం జుగుప్సాకర రాజకీయం.?
‘పరాయి వ్యక్తి భార్యని, ఇంకొకరెవరో పెళ్ళాం..’ అని అనకూడదు.! అది సభ్యత కాదు.! దురదృష్టవశాత్తూ ఉన్నత పదవుల్లో వున్నవాళ్ళూ నోటిలోని పెంటని బయటపెట్టుకుంటున్నారు నిస్సిగ్గుగా.!
ఏమో, రేప్పొద్దున్న వైఎస్ షర్మిల మీద కూడా ఈ తరహా ‘పెంట చల్లే’ ప్రయత్నం ఆ ఉన్నత పదవుల్లో వున్నవారు చేస్తారేమో.!
ఇక్కడితో ఆగుతారా, వైఎస్ విజయమ్మ మీద కూడా ఇదే తరహా పైత్యం ప్రదర్శిస్తారా.? రంకు రాజకీయం.. ఏదైనా చేయగలదు.!
ఈ వైఎస్ షర్మిల, ఒకప్పుడు వైసీపీ కోసం నానా కష్టాలూ పడ్డారు.! సుదీర్ఘ పాదయాత్ర కూడా చేశారు.! అన్న వదిలిన బాణం.. అని చెప్పుకున్నారామె.!
అప్పట్లో, ‘వైఎస్ షర్మిలా రెడ్డి’ అని పిలుచుకున్న వైసీపీ అభిమానులు, ఇప్పుడామె మీద చేస్తున్న జుగుప్సాకరమైన వ్యాఖ్యలు.. అత్యంత హేయం.!