బిగ్ హౌస్‌కి (Bigg Boss 3 Telugu) సంబంధించి ఇద్దరికి బిగ్ టెన్షన్ (Himaja Punarnavi Bhupalam Safe) తీరిపోయింది. ఈ వీక్ ఎలిమినేషన్‌లో మొత్తం ఆరుగురు రేసులో నిల్చుంటే, అందులోంచి ఇద్దరు సేఫ్ అయ్యారు. నలుగురు మాత్రం టెన్షన్ అనుభవించాల్సిందే రేపటి వరకు.
తొలి వీకెండ్‌లో కింగ్ నాగార్జున (King Akkineni Nagarjuna), తనదైన స్టైలింగ్‌తో దుమ్ము రేపేశారు. బోల్డంత ఫన్ ఇచ్చారు. అయితే, హౌస్ మేట్స్‌కి (Bigg House) సంబంధించిన క్లిప్పింగ్స్ (హౌస్‌లో జరిగిన విషయాలు) కొంత బోర్ కొట్టించేశాయి. ఆ తర్వాత మాత్రం స్పీడ్ స్పీడ్‌గా షో నడిచింది. వీకెండ్ షో, అంచనాలకు ఏమాత్రం తగ్గలేదు.
కింగ్ నాగార్జున (Nagarjuna), తన అనుభవాన్నంతా రంగరించి.. షోని పరుగులు పెట్టించారు. ‘పండూ’ అంటూ, చేతిలోని బొమ్మతో నాగ్ అడపా దడపా చెప్పిన మాటలు ఆకట్టుకున్నాయి. ఎలిమినేషన్ విషయానికొస్తే, హిమజతోపాటు (Himaja) పునర్నవి భూపాలం (Punarnavi Bhupalam) సేఫ్ జోన్‌లో నిలిచారు.
మొట్టమొదట సేఫ్ జోన్‌లోకి రావడం పట్ల హిమజ (Himaja) ఆనందంతో ఏడ్చేసింది. పైకి కన్పించలేదుగానీ, పునర్నవి కూడా అదే స్థాయిలో ఎమోషన్‌కి గురయ్యింది. ఇద్దరు సేఫ్ అవడంతో, ఎలిమినేషన్‌లో నలుగురు మిగిలారు. వారిలో వితిక షెరు (Vithika Sheru), జాఫర్ (Jaffar), రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj), హేమ (Hema) వున్నారు.
షోలో హైలైట్ ఎలిమెంట్ ఏంటంటే, మహేష్ విట్టా (Mahesh Vitta) కలర్ గురించి రవికృష్ణ హౌస్‌లో వేసిన ‘కర్రోడు’ సెటైర్ మీద నాగార్జున క్లాస్ తీసుకోవడం. రంగు, మతం, ప్రాంతం, జెండర్ వంటి విషయాలకు బిగ్ హౌస్ (Bigg Boss Telugu 3) అతీతమనీ, హౌస్ మాత్రమే కాదు.. ప్రపంచంలో ఎక్కడా ఈ విషయాలపై వివాదాలకు ఆస్కారమే లేదని తేల్చేశారు నాగార్జున (King Nagarjuna). మరోసారి రవికృష్ణ (Ravi Krishna), తాను చేసిన పనికి సారీ చెప్పడంతో, మహేష్ విట్టా (Mahesh Vitta) కూడా హ్యాపీ ఫీలయ్యాడు.
మరో హైలైట్ ఎలిమెంట్, వరుణ్ సందేశ్ – వితిక షెరుల రొమాన్స్ (Varun Sandesh Vithika Sheru Romance) గురించి నాగార్జున ప్రస్తావించడం. అన్నట్టు, శ్రీముఖికి (Sree Mukhi) నాగార్జున ‘స్వీట్’ క్లాస్ తీసుకున్నారండోయ్. అందరితోనూ అన్ని విషయాలూ మాట్లాడాలనీ, వివాదాలు పరిష్కరించేయాలనీ అత్యుత్సాహం చూపొద్దంటూ నాగ్ సున్నితంగా హెచ్చరించారు శ్రీముఖిని. అలా చేయడం వల్ల, ఇతరులు వేరే అర్థం తీసే అవకాశం వుందన్నది శ్రీముఖిని ఉద్దేశించి నాగ్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్.
హేమకీ నాగ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చేశారు. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్‌తోనూ సరదాగా మాట్లాడిన నాగార్జున, ‘అబ్జర్వేషన్’ విషయంలో మరీ అంత డిటెయిల్‌గా వెళ్ళినట్లు మాత్రం అన్పించలేదు. ఈ విషయంలో తొలి సీజన్ హోస్ట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) కంటే కూడా నానినే (Natural Star Nani) బెటర్. వారిద్దరి కంటే కాస్త వెనకబడి వున్నట్లన్పిస్తుంది నాగ్‌ని చూస్తే. ఏమో, రేపటి ఎపిసోడ్ నుంచి నాగ్ (King Nag) ఈ అబ్జర్వేషన్‌ని మరింత పెంచేస్తారేమో (Himaja Punarnavi Bhupalam Safe) చూడాలిక.