రామ్ గోపాల్ వర్మని తిట్టాలా? ఇలా ట్రై చేసి చూడండి.!

Ram Gopal Varma Nara Lokesh
Nara Lokesh Vs RGV.. మీరెప్పుడైనా రామ్ గోపాల్ వర్మని తిట్టాలని అనుకున్నారా.? అయితే, రామ్ గోపాల్ వర్మే తనను ఎలా తిట్టాలో చెబుతున్నాడు, తెలుసుకోండిక.!
అసలు విషయమేంటంటే, సోషల్ మీడియా వేదికగా నానా రకాల చెత్తా పోగేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. ఇది అందరికీ తెలిసిన విషయమే.
ఆ చెత్తని ఫాలో అయ్యేవాళ్ళందర్నీ వెర్రి వెంగళప్పల్ని చేయడమే ఆయన పని.! వర్మ రూటే సెపరేటు.!
అలాంటి వర్మ, పిచ్చి పిచ్చి సినిమాలూ తీస్తుంటాడు. ఎవరో డబ్బులిస్తారు, ఎవరికో డప్పు కొడతాడు.! ఇంకెవరికో వ్యతిరేకంగా సినిమాలు తీస్తాడు.
సమాజం పట్ల బాధ్యత.?
అసలు తనకు సమాజం పట్ల బాధ్యత లేనే లేదంటాడు వర్మ. అంతే కాదు, తాను నమ్మిన విషయాల్ని సినిమాలుగా తీస్తానంటూ, బయోపిక్స్ తెరకెక్కించేస్తుంటాడు.
వర్మని లైట్ తీసుకోవడమే మంచిది ఎవరైనా.! అలాంటిది, రాష్ట్రానికి మంత్రిగా పని చేసిన, ఎమ్మెల్సీగా పని చేసిన నారా లోకేష్, రామ్ గోపాల్ వర్మని విమర్శించడమేంటి.?
‘ఆ పిచ్చ.. నా డాష్‌కి నేను సమాధానం చెప్పడమేంటి.?’ అంటూ లైట్ తీసుకోవాలట నారా లోకేష్.! అలాగని ఉచిత సలహా ఇచ్చింది కూడా రామ్ గోపాల్ వర్మే.!
అర్థమయ్యింది కదా.. రామ్ గోపాల్ వర్మని ఎలా తిట్టాలో.! అర్థం కాకపోతే, ఇక్కడ ఇచ్చిన ట్విట్టర్ లింక్‌ని క్లిక్ చేసి, అందులో వీడియోను జాగ్రత్తగా పరిశీలించండి.
ఆ పిచ్చ నా డాష్ గురించి ఇంత ఆర్టికల్ అవసరమా.? అని నన్నడక్కండి.! ఇది జస్ట్ ఓ న్యూస్ అనుకుని సరిపెట్టుకోండి.! ఎంతైనా వర్మ పా…పులర్ కదా.!
