Mana Shankara Varaprasad Garu Review.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్.. ఇద్దరూ అన్నదమ్ముల్లా వుంటారు.! అలానే, అక్కినేని నాగార్జున కూడా.!
పలు సినీ వేదికలపైనా, ఇతర వేదికలపైనా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున మధ్య.. సన్నిహిత సంబంధాల్ని చూశాం. నాగ్, వెంకీ.. అని చిరంజీవి పిలుస్తుంటారు.
చిరంజీవిగారూ.. అని వెంకటేష్, నాగార్జున అంటుంటారు. ‘చిరంజీవి సర్’ అని వెంకటేష్ మరింత ఆప్యాయంగా పిలుస్తుండడం తెలిసిన విషయమే.
వెంకటేష్ తండ్రి దగ్గుబాటి రామానాయుడు, చిరంజీవిని ‘రాజా’ అని పిలవడం చాలామందికి తెలిసే వుంటుంది. అంతటి అనుబంధం ఆ ఇద్దరి మధ్యా వుంది.
అక్కినేని నాగేశ్వరరావు, చిరంజీవి కలిసి ‘మెకానికల్ అల్లుడు’ సినిమాలో నటించారు.
ఇప్పుడిదంతా ఎందుకంటే, మెగాస్టార్ చిరంజీవి – విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది గనుక.
Mana Shankara Varaprasad Garu Review.. మెగా విక్టరీ సంక్రాంతి పండగొచ్చేసింది..
థియేటర్లలోకి రావడమే కాదు, సంక్రాంతి పండగని కూడా తీసుకొచ్చేసింది తెలుగు సినీ పరిశ్రమకి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా.!
మొత్తం సినీ పరిశ్రమ తరలి వచ్చింది, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాని థియేటర్లలో చూసేందుకు. పలువురు సినీ ప్రముఖులు, థియేటర్లలో ‘చిరంజీవి – వెంకీ’ మధ్య కెమిస్ట్రీ చూసి పులకించిపోతున్నారు.
జస్ట్ 20 నిమిషాలు మాత్రమే, తెరపై వెంకటేష్ కనిపించారు. ఆ ఇరవై నిమిషాలు ఇంకో లెవల్ మెగా విక్టరీ జాతర.!
మెగాస్టార్ చిరంజీవి తెరపై చేసే అల్లరి.. అంటూ, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా గురించి దర్శకుడు అనిల్ రావిపూడి ముందే హింట్ ఇచ్చేశాడు.
నాన్ స్టాప్ అల్లరి నిజంగానే వెండితెరపై చాలా సరదాగా చేసుకుంటూ పోయారు చిరంజీవి. ప్రీమియర్స్‌కి ఫ్యామిలీ ఆడియన్స్ పోటెత్తారంటే, చిరంజీవి అల్లరిని చూసేందుకు ఏ స్థాయి ఉత్సాహం చూపించారో ఆడియన్స్ అర్థం చేసుకోవచ్చు.
ఆద్యంతం ప్రేక్షకులు సినిమాని ఎంజాయ్ చేస్తూనే వున్నారు. కథ, కాకరకాయ్.. ఇవన్నీ కాదు.. తెరపై నటీనటులు పోటీ పడి చేసే అల్లరి ప్రేక్షకులకి బాగా నచ్చింది.
ఒకట్రెండు ఎమోషనల్ సీన్స్ దగ్గర కాస్త ఆడియన్స్ కామ్ అయినా, ఆ తర్వాత మళ్ళీ జోష్ రెండింతలు ప్రదర్శించారు. సినిమాటోగ్రఫీ, మాటలు, పాటలు, వాట్ నాట్.. అన్నీ బాగా సెట్ అయ్యాయి.
పెర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా.. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ గురించి, ఆడియన్స్ రివ్యూలు ఇస్తుండడం గమనార్హం.
అనివార్య కారణాల వల్ల భార్యకి దూరమైన సెక్యూరిటీ ఆఫీసర్, తిరిగి తన భార్యకు దగ్గరయ్యేందుకు చేసే ప్రయత్నమే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా కథ.. సింపుల్‌గా చెప్పాలంటే.
నయనతార స్క్రీన్ ప్రెజెన్స్ అదిరింది. వెంకటేష్ గెస్ట్ అప్పీయరెన్స్ ఆకట్టుకుంది. చిరంజీవి చేసిన అల్లరి, ఆపై చిరంజీవి చేసిన డాన్సులు.. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాకి రిపీట్ ఆడియన్స్‌ని తీసుకొస్తాయ్.
దర్శకుడు అనిల్ రావిపూడి, మెగా ఫ్యాన్స్‌కి ఏం కావాలో బాగా రీసెర్చ్ చేసి, అవే ఇచ్చేశాడు. వాటికి అదనంగా, ప్రత్యేకించి ఫ్యామిలీ ఆడియన్స్, అందునా మహిళలు మెచ్చే ఇంగ్రెడియన్స్‌ని జోడించాడు.
ఆన్ స్క్రీన్ చిరంజీవి గ్రేస్ గురించీ, చిరంజీవి అల్లరి గురించీ.. కథలు కథలుగా చెప్పుకోవాల్సిందే. అది బిగ్ స్క్రీన్ మీద విట్నెస్ చేస్తే.. ఆ కిక్కే వేరప్పా.!
మెగాస్టార్ చిరంజీవి సినిమా హిట్టయితే.. తెలుగు సినీ పరిశ్రమకి కొత్త కళ వస్తుందన్నది జగమెరిగిన సత్యం.! ఈ సంక్రాంతికి అలాంటి వెలుగుని తీసుకొచ్చారు చిరంజీవి.
