Tollywood Mega Hit Sankranti.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు.? తెలుగు సినిమా కళకళ్ళాడుతోంది.. వరుస సినిమాల విజయాలతో, తెలుగు సినీ పరిశ్రమ పునర్వైభవం దిశగా దూసుకుపోతోంది.!
సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించే కంటెంట్‌తో సినిమాలు చేయగలిగితే.. తెలుగు సినిమా బాక్సాఫీస్ కళకళ్ళాడుతుందని ఇంకోసారి నిరూపితమయ్యింది.
‘ది రాజా సాబ్’ కాస్త నిరాశపర్చింది.. దాంతో, సంక్రాంతికి విడుదలయ్యే మిగతా సినిమాల పరిస్థితేంటోనని అంతా ఒకింత భయపడ్డారు.!
కానీ, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా రాకతో, లెక్కలన్నీ మారిపోయాయి. ఆ తర్వాత ‘అనగనగా ఒక రాజు’, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘నారీ నారీ నడుమ మురారి’, సినిమాలలూ అదరగొట్టేశాయ్.!
Tollywood Mega Hit Sankranti.. వెయ్యి కోట్లు.. అదరహో టాలీవుడ్..
‘ది రాజా సాబ్’ నిరాశపర్చినా, సంక్రాంతికి విడులైన ఇతర సినిమాలు హిట్టవడంతో, ఓవర్ ఫ్లోస్ కొంత మేర ‘ది రాజా సాబ్’కి కలిసొచ్చాయి.
అయినాగానీ, ‘ది రాజా సాబ్’ డిజాస్టర్ ఫిలింగా మిగిలిపోయింది. కాకపోతే, నష్టాలు కాస్త తగ్గాయంతే.! కాస్త పాజిటివ్ థింగ్ ఇదొక్కటే ‘ది రాజా సాబ్’ సినిమాకి సంబంధించినంతవరకు.
సినిమాకి ఖర్చు చేసిన బడ్జెట్, సుదీర్ఘ కాలం సినిమా మేకింగ్.. ఇవన్నీ శాపంగా మారాయి ‘ది రాజా సాబ్’ సినిమాకి.
ఇక, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసుకుని, థియేటర్లలోకి వచ్చేసింది.. సంక్రాంతికి మెగా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఆల్రెడీ ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా 300 కోట్ల క్లబ్బులోకి చేరిన సంగతి తెలిసిందే. ఓవర్సీస్‌లో 3 మిలియన్ల క్లబ్‌లోకి చేరిందీ సినిమా.
ఇక, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, ‘అనగనగా ఒక రోజు’, ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ అవడం గమనార్హం. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ నుంచి వచ్చిన ఓవర్ ఫ్లోస్ ఈ సినిమాలకు అడ్వాంటేజ్ అయ్యాయి.
థియేటర్ల విషయంలో ఇంకాస్త బెటర్ ప్లానింగ్ చేసుకుని వుంటే, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఖాతాలో, మరిన్ని కోట్లు అదనంగా వచ్చి వుండేవే.
మెగాస్టార్ చిరంజీవి వాటా మూడొందల కోట్లు..
ఎలాగైతేనేం, టాలీవుడ్ పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి హిట్టు బోణీ కొట్టారు తెలుగు సినీ పరిశ్రమ తరఫున. ఆ బాటలో, మరో మూడు బ్రేక్ ఈవెన్ సినిమాలొచ్చాయ్.!
ఎలా చూసినా, తెలుగు సినీ పరిశ్రమకి ఇదొక మెగా సంక్రాంతి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే, సంక్రాంతికి నాలుగైదు సూపర్ హిట్ సినిమాలకు అకామడేట్ చేయొచ్చని నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇకనైనా గుర్తిస్తే మంచిదే.
అన్నిటికీ మించి, ఒక సినిమాకి ఇంకో సినిమా టీమ్ తరఫున విషెస్ చెప్పుకోవడం.. తెలుగు సినీ పరిశ్రమ అంతా ఒక్కటేనని చాటి చెప్పడం.. ఈ సంక్రాంతి సినిమాల అద్భుత విజయాలకి కారణం.
మొత్తంగా చూసుకుంటే, దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు ఈ సంక్రాంతికి తెలుగు సినిమా బాక్సాఫీస్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో పెద్ద వాటా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాదే.!
