Naveen Polishetty Tollywood.. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఇటీవల ‘అనగనగా ఒక రాజు’ సినిమాతో హిట్టు కొట్టాడు.!
సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో నాలుగు హిట్ సినిమాలు.. అందులో, నవీన్ పోలిశెట్టి సినిమా కూడా వుంది.
మెగాస్టార్ చిరంజీవిని ‘గురువుగారు’ అంటుంటాడు నవీన్ పోలిశెట్టి. అదే, అతను చేసిన అతి పెద్ద తప్పిదంగా మారిపోయింది.
నవీన్ పోలిశెట్టి మీద ఓ వర్గం మీడియా పనిగట్టుకుని దుష్ప్రచారం చేయడానికి ఇంతకన్నా కారణం ఇంకేం కావాలి.?
త్వరలో రెండు ప్రాజెక్టుల్ని అనౌన్స్ చేయబోతున్నాం.. అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరో నవీన్ పోలిశెట్టి వ్యాఖ్యానించాడు.
అంతే, నిర్మాతలకి నవీన్ పోలిశెట్టి కండిషన్స్ పెట్టాడంటూ, పెయిడ్ నెగెటివిటీతో కూడిన వార్తలు ప్రచారంలోకి వచ్చేశాయి.
నిర్మాత డబ్బులు మాత్రమే ఖర్చు పెట్టాలి. సినిమా మొత్తం పూర్తయ్యేవరకు మాట్లాడకూడదు.. సినిమాని పూర్తి చేసిన తర్వాత, హీరో నిర్మాతకి ఆ సినిమా చూపిస్తాడన్నది ఆ గాసిప్స్ సారాంశం.
యంగ్ జనరేషన్ హీరోల్లో చాలామంది మల్టీ టాలెంటెడ్. విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పోలిశెట్టి.. తదితరులు తమ సినిమాలకి తామే దర్శకత్వం కూడా చేసుకోగలరు.
డైలాగులు రాసుకోవడం దగ్గర్నుంచి, అవసరమైతే సినిమా నిర్మాణం కూడా తామే చేసుకోగల సామర్థ్యం వున్నవాళ్ళు ఈ తరం యంగ్ హీరోలు.
సో, చేయబోయే సినిమాకి సంబంధించి అన్ని విభాగాలపై పట్టు వుండడం సహజమే. అది నేరమేమీ కాదు. సినిమా మేకింగ్ అనేది చాలా మారింది ఇటీవలి కాలంలో.
ఒకవేళ నిర్మాత ముందు నవీన్ పోలిశెట్టి కండిషన్స్ పెట్టి వుంటే, అది నిర్మాతకు హీరోకు మాత్రమే సంబంధించిన విషయం. నచ్చకపోతే, నిర్మాత ఆ సినిమా చెయ్యడు.
హీరోల ఇన్వాల్వ్మెంట్ని దర్శక నిర్మాతలు ఒప్పుకుంటున్నారంటే, దానర్థమేంటి.? సక్సెస్ ఫెయిల్యూర్ అనేవి హీరోల కెరీర్లను డిసైడ్ చేస్తుంటాయి.
సో, హీరో కావాలని ఎందుకు డిజాస్టర్ సినిమా చేసుకుంటాడు.. వేలు పెట్టి మరీ.? హిట్ ఫ్లాప్ అనేవి సర్వసాధారణం సినీ పరిశ్రమలో.
ఒక్కోసారి మంచి ప్రాజెక్టులూ వర్కవుట్ కావు. ఒక్కోసారి సిల్లీ ప్రాజెక్టులు కూడా బాగా వర్కవుట్ అవుతుంటాయి. అదే సినీ మ్యాజిక్ అంటే.!
