Choreographer Jani Shaik.. ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మీద మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ, సదరు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేసిన ఫిర్యాదు మేరకు, పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
ఈ ఘటనపై ఇంతవరకు కొరియోగ్రాఫర్ జానీ స్పందించలేదు. ఆయన ప్రస్తుతం జనసేన నేతగా వున్నారు.
జానీ మాస్టర్‌పై ఆరోపణల నేపథ్యంలో, ఆయన్ను పార్టీ కార్యకలాపాలకు దూరంగా వుండాలని జనసేన పార్టీ అధినాయకత్వం ఆదేశాలు జారీ చేసింది.
Choreographer Jani Shaik.. జానీ తప్పు చేశాడా.?
సినీ ప్రముఖులపై ఈ తరహా లైంగిక వేధింపుల ఆరోపణలు కొత్త కావు. చాలా కేసుల్లో ఆరోపణలన్నీ ఉత్తవేనని తేలిపోవడం, కొన్నిసార్లు.. ఆరోపణలు నిజమని తేలడం తెలిసిన విషయాలే.
నిజానికి, సినీ పరిశ్రమ అనే కాదు.. ఇటీవలి కాలంలో వివిధ రంగాల్లో ఈ తరహా ఆరోపణలు చూస్తున్నాం.. వాటిల్లో ఫేక్ వ్యవహారాల్నీ చూస్తున్నాం.
ఈ కేసులో బాధితురాలిగా చెప్పబడుతున్న అసిస్టెంట్ కొరియోగ్రాఫర్, జానీ వద్దనే పనిచేసినట్లు చెబుతున్నారు.
గత కొంతకాలంగా ఆమె మీద లైంగిక వేధింపులు జరుగుతోంటే, ఇన్నాళ్ళూ మౌనంగా వుండి, ఇప్పుడే ఆమె ఎందుకు పోలీసుల్ని ఆశ్రయించింది.? అన్నది ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్.
మత మార్పిడి ఆరోపణలు..
జానీ, తన వద్ద పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ని లైంగికంగా వేధించడమే కాదు, మత మార్పిడి దిశగా ఒత్తిడి తెచ్చాడనే ఆరోపణలూ వున్నాయి.
ఈ ఆరోపణ సైతం అత్యంత తీవ్రమైనది. అంత తేలిగ్గా ఈ కేసు నుంచి జానీకి ఉపశమనం దొరికేలా కనిపించడంలేదు.
ప్రస్తుతం జానీ అజ్ఞాతంలో వున్నట్లుగా మీడియాలో కథనాల్ని చూస్తున్నాం. తప్పు చేయని పక్షంలో, జానీ మీడియా ముందుకొచ్చి, తన వాదనను వినిపించాల్సి వుంది.