Jagan Padayatra Again.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఏడాదిన్నర తర్వాత, ఏడాదిన్నరపాటు పాదయాత్ర చేస్తారట.!
ఇటీవలే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తన పాదయాత్రకు సంబంధించి మరోమారు స్పష్టత ఇచ్చారు. గతంలోనూ వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు.!
ఆ పాదయాత్రతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో అధికార పీఠమెక్కిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలకు ముందర టీడీపీ నేత నారా లోకేష్ కూడా పాదయాత్ర చేశారు.. టీడీపీ అధికారంలోకి వచ్చింది.
తెలుగు నేలపై రాజకీయ పాదయాత్ర అంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డితో మొదలైన ట్రెండ్ ఇది. ఆ త్వాత నారా చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర చేశారు.
మహిళా రాజకీయ నాయకుల్లో వైఎస్ షర్మిల, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో వైసీపీ తరఫున, తెలంగాణలో సొంత పార్టీ (వైఎస్సార్ తెలంగాణ పార్టీ) అధినేతగా పాదయాత్ర నిర్వహించారు.
షర్మిల, అధికార పీఠమెక్కలేదు.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని విలీనం చేసేసి, తెలంగాణ రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. ఏపీ రాజకీయాల్లో వున్నారామె.. పీసీసీ అధ్యక్షురాలిగా.
Jagan Padayatra Again.. అధికారం కోసం పాదయాత్ర.. ఈసారేమవుతుందో.!
ఇంతకీ, వైఎస్ జగన్ పాదయాత్ర, ఆయనకు తిరిగి అధికార పీఠాన్ని అందిస్తుందా.? ఇదైతే మిలియన్ డాలర్ క్వశ్చన్. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఏదీ ముందే ఊహించలేం.
2024 ఎన్నికలకు ముందర వైఎస్ జగన్, ‘వై నాట్ 175’ అన్నారు. అంతేనా, ‘సిద్ధం’ సభలతో నానా హడావిడీ చేశారు. అసలంటూ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తమకు సరైన ప్రత్యర్థే లేరని జగన్ బలంగా నమ్మారు.
కట్ చేస్తే, 11 సీట్లకు పడిపోయింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఓడిపోయాక, బెంగళూరుకే పరిమితమైపోయారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
ఏడాది తర్వాత వచ్చి, ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే వుంటాను పాదయాత్రతో.. అని వైఎస్ జగన్ చెబుతుండడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రజల్లో బిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
జగన్ గెలిస్తే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వుండదు..
2019 ఎన్నికలకు ముందర వైఎస్ జగన్ పాలనని ప్రజలు చూడలేదు. ఓ ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడలా కాదు. వైఎస్ జగన్ అధికార పీఠమెక్కితే, రాష్ట్రానికి రాజధాని వుండదని జనం ఓ నిర్ణయానికి వచ్చేశారు.
వైసీపీ హయాంలో రోడ్ల దుస్థితి ప్రజలకు తెలుసు. మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే, రోడ్ల దుస్థితి ఎలా వుంటుందో.. అన్న ఆలోచనే ప్రజల్ని భయపెడుతోంది
చెప్పుకుంటూ పోతే, చాలానే వున్నాయ్.! రాధానిపై స్పష్టత ఇవ్వాలి.. చేసిన తప్పులపై వైఎస్ జగన్ ఆత్మ విమర్శ చేసుకోవాలి.. అది, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలగాలి.
ఇవేవీ కాకుండా, ఇంకా ‘నేను నొక్కిన బటన్లు..’ అంటూ, వైఎస్ జగన్ ‘సొంత డబ్బా’ కొట్టుకుంటే, 11 సీట్లు కాస్తా గల్లంతయి, 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘సింగిల్ సీటు’కే పరిమితమైపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
ఎమ్మెల్యేగా గెలిచి కూడా అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టపడని వైఎస్ జగన్, ఏ మొహం పెట్టుకుని శాసన సభ్యుడిగా తనను, తమ పార్టీకి చెందిన మొత్తం 11 మందిని గెలిపించాలని ప్రజల్ని వచ్చే ఎన్నికల్లో అడుగుతారు.?
పాదయాత్రలో రాష్ట్ర ప్రజల నుంచి వైఎస్ జగన్ ఎదుర్కోబోయే అతి ముఖ్యమైన ప్రశ్న ఇది.!
