Home » సర్జరీల మీద సర్జరీలు! పవన్ కళ్యాణ్ బలం, బలహీనత అభిమానులే!

సర్జరీల మీద సర్జరీలు! పవన్ కళ్యాణ్ బలం, బలహీనత అభిమానులే!

by hellomudra
0 comments
Pawan Kalyan

Pawan Kalyan Surgeries.. తమ అభిమాన నటుడు లేదా నాయకుడి మీద అభిమానం హద్దులు మీరితే ఎలా వుంటుంది.? ఇదిగో, ఇలా వుంటుంది.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి సర్జరీల మీద సర్జరీలు జరుగుతున్నాయి. గత కొన్నాళ్ళుగా ఆయన తరచూ, అనారోగ్య సమస్యలతో వార్తల్లోకెక్కుతున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జన సేన పార్టీ అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్‌కి తాజాగా ముంబైలో సర్జరీ జరిగింది.

కుడి భుజానికి శస్త్ర చికిత్సని విజయవంతంగా నిర్వహించిన వైద్యులు, దాదాపు నాలుగు నెలలపాటు పూర్తిస్థాయిలో విశ్రాంతి అవసరమంటూ, స్పష్టం చేశారు.

ఆరు నెలల తర్వాత, మరో భుజానికి సర్జరీ చేయాల్సి వుంటుందన్నది వైద్యులు, జన సేన పార్టీ వర్గాలు చెబుతున్నమాట.

కొన్నాళ్ళ క్రితమే, పవన్ కళ్యాణ్‌కి శ్వాస సంబంధిత సమస్యకు గాను హైద్రాబాద్‌లో శస్త్ర చికిత్స జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ, హైద్రాబాద్ వచ్చి, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి పరామర్శించారు అప్పట్లో.

సర్జరీ తీవ్రత ఎంత.? అన్నది అప్పట్లో ప్రధాని, పవన్ కళ్యాణ్ ఇంటికి స్వయానా వెళ్ళడంతో స్పష్టమయ్యింది. తాజాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ముంబైకి వెళ్ళి ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్‌ని పరామర్శించారు.

ఇంతకీ, పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్యలకు కారణమేంటి.? ఇంకెవరు, అభిమానులే.! పవన్ కళ్యాణ్ బలం, బలహీనత.. రెండూ అభిమానులే.!

జనంలోకి పవన్ కళ్యాణ్ వెళితే, అభిమానులు పోటెత్తుతారు. పవన్ కళ్యాణ్‌తో సెల్ఫీల కోసం ఎగబడతారు. కరచాలనం కోసం హద్దులు దాటేస్తారు. అదే అసలు సమస్య.

ఓ అభిమాని, పవన్ కళ్యాణ్‌ కారు మీద నిల్చుని వున్నప్పుడు, కారు పైకెక్కి.. పట్టు తప్పి తాను తూలిపోతూ, పవన్ కళ్యాణ్‌ని కిందికి లాగేశాడు. అప్పట్లో, పవన్ కళ్యాణ్ భుజానికి అంతర్గతంగా గాయమైంది.

ఇలాంటివి చాలా సార్లు జరిగాయి, జరుగుతూనే వున్నాయి. అయినా, పవన్ కళ్యాణ్ ఏనాడూ అభిమానుల మీద ఆగ్రహాన్ని ప్రదర్శించింది లేదు.

అయితే, అదే పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రతిసారీ తమ అభిమాన నాయకుడికి రక్షణ కవచంలా నిలుస్తుంటారు. కానీ, ఒకరిద్దరి అత్యుత్సాహం కొంప ముంచుతోంది.

ఇకపై అభిమానులు మరింత అప్రమత్తంగా వుండాల్సిందే. సర్జరీల తీవ్రత దృష్ట్యా అభిమానుల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ ఏళ్ళ తరబడి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలకు ఈ సర్జరీలతో ఉపశమనం కలుగుతుండడం మరో కోణంలో మంచి విషయమే.

అన్నట్టు, వరుస సర్జరీల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా ‘ఓజీ2’ మరింత ఆలస్యమయ్యేలా వుంది. ఈ ఏడాది ‘ఓజీ2’ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడం అనుమానమే.

అదే సమయంలో, ‘ఓజీ2’ కోసం, మరింత ఉత్సాహంగా సన్నద్ధమయ్యేందుకు, ఈ సర్జరీలు ఉపకరిస్తాయి పవన్ కళ్యాణ్‌కి.

ప్రజా జీవితంలోనూ పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో మరింత యాక్టివ్ అవబోతున్నారన్నది నిర్వివాదాంశం.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group