Home » దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పెంపు.! అసలెంత జరగాలి.?

దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పెంపు.! అసలెంత జరగాలి.?

by Mudra369 Editorial Desk
0 comments
Narendra Modi

Delimitaion Bill 2026 Narendra Modi.. దేశవ్యాప్తంగా లోక్ సభ నియోజకవర్గాల పెంపు దిశగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

లోక్ సభ నియోజకవర్గాలతోపాటు, అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఈ నిర్ణయంతో పెరగనున్నాయి. ఇంతకీ, ఎంత పెరగాలి.? ఎంత పెరుగుతుంది.? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.

వాస్తవానికి, ప్రస్తుత లోక్ సభ నియోజకవర్గాల సంఖ్య, 1971 నాటి జనాభా లెక్కల ప్రకారం నిర్ణయించబడింది.. చాలా ఏళ్ళ క్రితం. అప్పటి దేశ జనాభా దాదాపుగా 55 కోట్లు.

మరిప్పుడు, భారత దేశ జనాభా ఎంత.? దాదాపు 150 కోట్లకు పెరిగింది భారత దేశ జనాభా. అంటే, జనాభాని ప్రాతిపదికగా తీసుకుంటే, దాదాపు మూడు రెట్లు పెరగాలి లోక్ సభ సీట్లు.

Delimitaion Bill 2026 Narendra Modi.. మూడు రెట్లు పెరిగితే ఇంకేమన్నా వుందా.?

కానీ, మూడు రెట్లు పెరిగితే ఇంకేమన్నా వుంది.? భారత దేశం ఆ భారాన్ని మోయగలదా.? అన్న ప్రశ్న తెరపైకి రావడం సహజమే.

దేశవ్యాప్తంగా, యాభై శాతం లోక్ సభ సీట్లు అన్ని రాష్ట్రాల్లోనూ పెరుగుతాయన్నది తాజాగా వినిపిస్తున్న వాదన.

ఓ రాష్ట్రంలో ఎక్కువ సీట్లు, ఇంకో రాష్ట్రంలో తక్కువ సీట్లు వున్నాయి గనుక.. పెద్ద రాష్ట్రాలకు మేలు, చిన్న రాష్ట్రాలకు నష్టం.. అనే వాదనా లేకపోలేదు.

ఇవన్నీ కాదు, జనాభా ప్రాతిపదికన లోక్ సభ సీట్లు పెంచాలన్నది ఇంకో వాదన. అలాగైతే, కుటుంబ నియంత్రణని పక్కాగా అమలు చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయనే వాదనా వినిపిస్తోంది.

Delimitaion Bill 2026 Narendra Modi.. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా..

మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పెంపు బిల్లు.. ఈ రెండు బిల్లులూ పార్లమెంటుకు ముందుకు రాబోతున్నాయి. ఈసారి రెండు బిల్లులకూ ఎలాంటి ఆటంకాలూ వుండకపోవచ్చు.

కానీ, దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పెంపు విషయమై పెద్ద రచ్చే జరుగుతోంది. బోల్డన్ని అనుమానాలూ వున్నాయి.

నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సిందే.. కానీ, ఎవరికీ అన్యాయం చేయకూడదన్నది కీలకమైన పాయింట్ ఇక్కడ. నియోజకవర్గాల పెంపు, అధికారంలో వున్నవారికి అడ్వాంటేజ్ అవుతుందా.?

ఔను, నియోజకవర్గాల సరిహద్దుల విషయమై, అధికార పార్టీలు తమ రాజకీయ వ్యూహాలకు అనుగుణంగా, తమ అవసరాలకు అనుగుణంగా వ్యవహరించే అవకాశమూ లేకపోలేదు.

తేనెతుట్టెను కదిపినట్లేనా.?

ఎలా చూసినా, నియోజకవర్గాల పెంపు.. అనగా డీలిమిటేషన్ వ్యవహారం.. తేనెతుట్టెను కలిపినట్లే అవుతుందన్నది నిర్వివాదాంశం.

కానీ, తప్పదు.! దాదాపు పాతిక లక్షల మందికి ఓ ఎంపీ ప్రాతినిథ్యం వహించడమంటే.. అది చిన్న విషయం కాదు. నియోజకవర్గాల పెంపు జరగాల్సిందే.

Also Read: ‘బ్రా’బోయ్.! ధర నాలుగు వందల డెబ్భయ్ నాలుగు కోట్లు అంటోయ్.!

జమిలి ఎన్నికలకు ముందర, డీలిమిటేషన్ అలానే మహిళా రిజర్వేషన్ బిల్లు.. ఈ అద్భుతాలు జరగడం సానుకూల వ్యవహారమే.!

ఎప్పుడో జరగాల్సిన డీలిమిటేషన్, ఎప్పుడో జరగాల్సిన జమిలి ఎన్నికలు.. ఇన్ని దశాబ్దాల తర్వాత.. అదీ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో జరుగుతున్నాయ్.!

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Editor's Picks

Most viewed

trending

© 2026, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group