Geetu Mohandas Toxic Disaster.. ‘టాక్సిక్’ సినిమా కంటే ముందు.. ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయ్. నిజానికి, హీరో యష్ ‘కేజీఎఫ్’ చేశాక, ఈ ఫార్మాట్‌లో బోల్డన్ని సినిమాలు వరదలా దూసుకొచ్చాయ్.
కాకపోతే, ‘టాక్సిక్’ ఇంకాస్త భిన్నమైన సినిమా. టైటిలే ‘టాక్సిక్’ కాబట్టి, ఇందులో హీరో పాత్ర నుంచి పద్ధతిగా ఏం ఆశించగలం.?
‘మేమేం అద్భుతాలు చేసెయ్యడం లేదు..’ అంటూ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో యష్ స్పష్టతనిచ్చేశాడు కూడా. దర్శకురాలు గీతూ మోహన్ దాస్, ఈ సినిమాని సరిగ్గా తియ్యలేదన్న విమర్శలు సహజమే.
డిజాస్టర్ సినిమా.. అని, ‘టాక్సిక్’ గురించి తొలి రోజే బీభత్సమైన రివ్యూలు వచ్చేశాయి. సగటు ప్రేక్షకుడు కూడా ‘టాక్సిక్’ సినిమాని డిజాస్టర్‌గా తేల్చేశాడు.

ఇక, ‘టాక్సిక్’ గురించి గొప్పగా చెప్పుకోవడానికేమీ లేక, టీమ్ మొత్తం సైలెంటయిపోయింది. ట్రోలింగ్ ఎటూ జరుగుతోందనుకోండి.. అది వేరే సంగతి.
కొన్ని సినిమాలు హిట్టవుతాయి.. చాలా సినిమాలు ఫట్టవుతాయి.. ఇదే సినీ మాయ.! భారీ అంచనాలు పటాపంచలైపోవడం సర్వసాధారణం.
ఓ మహిళ బరితెగించి తెరకెక్కిన సినిమా ‘టాక్సిక్’ అంటున్నారు కొందరు. ఇదే సినిమాని ఓ మేల్ డైరెక్టర్ తెరకెక్కిస్తే ఓకేనా.?
సినిమాలోని వల్గర్ కంటెంట్ మీద డిబేట్.. అంటే, అది వేరే చర్చ. హింస మీద డిబేట్ అంటే, అది ఇంకో చర్చ. కానీ, దర్శకత్వం వహించింది మహిళ కాబట్టి, ట్రోల్ చేస్తామంటే ఎలా.?

‘హీరోయిన్ల కంటే గ్లామర్ ఎక్కువ ఒలకబోసింది.. అంగాంగ ప్రదర్శన మీద వ్యక్తిగతంగా ఆసక్తి ఎక్కువ..’ అంటూ గీతూ మోహన్ దాస్ మీద జుగుప్సాకరంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు.
అంతకు ముందు పెద్ద సినిమాలు చేయకపోయినా, ఆలోచింపజేసే సినిమాల్ని.. అదీ అవార్డ్ విన్నింగ్ కంటెంట్‌ని తెరకెక్కించింది గీతూ మోహన్ దాస్.
నిజానికి, వందల కోట్లు ఖర్చు పెట్టేలా నిర్మాతని ‘టాక్సిక్’ సినిమాకి ఒప్పించడమే గీతూ మోహన్ దాస్ సాధించిన ఘన విజయం.
కాకపోతే, కొన్ని ఈక్వేషన్స్ సెట్ అవక ‘టాక్సిక్’ డిజాస్టర్ అయ్యింది. నష్టపోయిన వారందర్నీ ఆదుకునేందుకు ‘టాక్సిక్’ నిర్మాత, హీరో.. ఆల్రెడీ తెరవెనుక ప్రయత్నాలు ముమ్మరం చేశారట.
అదే జరిగితే, అది మంచి విషయమే కదా.! ఏదిఏమైనా యష్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కూడా.!
